ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో ప్రభాస్‌తో పాటు దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, కమల్ హాస్‌న్ ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్ రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటి స్టార్స్ స్పెషల్ క్యామియోస్ ఇచ్చారు. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీని త్వరలో జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జపాన్ భాషలో ట్రైలర్ (Kalki 2898 AD Japanese Trailer)ను విడుదల చేశారు.
జపాన్ భాషలో ట్రైలర్..
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదల కాబోతోంది. అలాగే అక్కడ జరిగే షోగాట్స్ ఫెస్టివల్‌లో ఈ మూవీని గ్రాండ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. జపాన్ భాషలో డబ్ చేసిన ట్రైలర్ (Kalki 2898 AD Japanese Trailer)ను సైతం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
నెలాఖరులో ప్రమోషన్స్
‘బాహుబలి 2’ సినిమా జపాన్ రిలీజ్ సమయంలో యూనిట్ సభ్యులు అక్కడకు వెళ్లి ప్రమోట్ చేశారు. అదే విధంగా ‘కల్కి’ (Kalki 2898 AD) టీమ్ సైతం సినిమాను ప్రమోట్ చేయడం కోసం జపాన్ వెళ్లనుందట. మేకర్స్, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చర్చించి జపాన్‌లో మూడు రోజుల పాటు ప్రమోషన్స్‌కి ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ మూడు లేదా నాల్గో వారంలో ప్రభాస్ అండ్ టీమ్ జపాన్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
కల్కి టార్గెట్ ఎంతంటే?
జపాన్‌లో ‘RRR’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంతకుముందు వచ్చిన ‘బాహుబలి 2’ దాదాపుగా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer)టార్గెట్ 5 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే ప్రభాస్ ప్రమోషన్స్‌లో భాగంగా కచ్చితంగా అక్కడ ల్యాండ్ అవ్వాల్సిందే.
ట్రెండింగ్‌లోకి కల్కి
‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Japanese Trailer) చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తుండటంతో పాటు ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేయడంతో చాలా రోజుల తర్వాత ఈ చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. #Kalki2898AD మరోమారు వైరల్ అవుతోంది. జపాన్ ప్రేక్షకులను సైతం ‘కల్కి’ మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ‘కల్కి 2898 ఏడీ’ అక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
కల్కి రికార్డు గల్లంతు
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ (Kalki 2898 AD) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లను కొల్లగొట్టింది. తన వసూళ్ల సునామీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజున రూ.191.5 కోట్లు రాబట్టి హైయస్ట్ డే 1 గ్రాసర్ చిత్రాల్లో టాప్‌లో నిలిచింది. తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ రూ.296 కోట్ల వసూళ్లతో కల్కిని బీట్ చేసింది. తొలి స్థానంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.223 కోట్లు) సైతం రెండో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!