సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్ ఇండిలిజెన్స్)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా ‘కంగువా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
ధూమ్ 4 విలన్‌గా సూర్య!
హిందీలో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే ‘ధూమ్ 4’ పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్, పార్ట్ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
రోలెక్స్‌గా మార్క్!
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. రోలెక్స్ పాత్రలో అతడి లుక్ ఎంతో క్రూరంగా కనిపించింది. ‘విక్రమ్ 2’ చిత్రంలో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్ రోల్.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్