నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశించారు కానీ, అంచనాలను మించి రాణిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్లో భారీ కలెక్షన్లు రాబడుతుంది. హిందీలో లాల్‌సింగ్ చడ్డా, రక్షాబంధన్ వంటి సినిమాలను పక్కకు నెట్టి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్లో ఇప్పటివరకు మూవీ విడుదలైన 9 రోజుల్లో 15.32 కోట్లు సాధించింది. మొదటి రోజు కలెక్షన్స్ రూ.7 లక్షలు కాగా తొమ్మిదో రోజు రూ.4.07 కోట్లు వసూలు చేయడం విశేషం.
మొదటి వారం కంటే దాదాపుగా రెండింతల కలెక్షన్లు సాధించి ఇటీవల కాలంలో ఏ సినిమాకు సాధ్యం కానీ ఫీట్ సాధించింది. సాధారణంగా ఏ సినిమాకైనా ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా ఉంటాయి. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి కానీ కార్తికేయ-2 విషయంలో మాత్రం అది పూర్తి రివర్స్‌గా కనిపిస్తోంది. తొలి వీక్ మొత్తంగా రూ.5.75 కోట్లు రాబడితే రెండో వారంలో కేవలం వీకెండ్ వరకే రూ.9.57 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.15.32 కోట్ల వసూళ్లు రాబట్టి బాలివుడ్ సినిమాలకు షాక్ ఇచ్చింది.
ఇక విదేశాల్లో కూడా 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.75.33 కోట్లు వసూలు చేసింది. ట్రెండ్ ఇలానే కొనసాగితే రూ.100 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ రావడంతో థియేటర్లో సినిమా చూడాలనుకునేవారికి మొదటి ఆప్షన్ ఇప్పుడు కార్తికేయ 2 కనిపిస్తుంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
కార్తికేయ సినిమాకు సీక్వెల్ వచ్చిన ఈ మూవీలో నిఖిల్ డాక్టర్ పాత్రలో నటించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. చందూమొండేటి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ప్రేక్షకులు చాలామంది కార్తికేయ 2 చూసిన తర్వాత.. మొదటి నుంచి స్టోరీ తెలుసుకునేందుకు కార్తికేయ 1 చూస్తున్నామని ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.
శ్రీకృష్ణుడు జన్మించిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇది అందరూ చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్లను, షోలను పెంచారు. కథలో ఉన్న బలమై కంటెంట్ కారణంగా కార్తికేయ 2 ఘన విజయం సాదించిందన సినీవర్గాలు చెప్తున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వంటివాళ్లు సినిమాను ప్రశంసించడం, బిగ్‌బీ అమితాబ్ చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి మరీ అభినందించడం మంచి పరిణామంగా చెప్పవచ్చు.