• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’… సినిమా హిట్టా? ఫట్టా?

    నటీనటులు:  శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్‌ తదితరులు

    దర్శకత్వం: తేజ మర్నీ

    సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్

    సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి 

    నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌

    నిర్మాతలు: బన్నీ వాసు,  విద్యా 

    విడుదల తేదీ: నవంబర్‌ 24, 2023

    ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న ‘నయట్టు’కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ చేరిందా? శివానీ రాజశేఖర్‌ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, విజయ్‌, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్‌ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు.  మురళీ శర్మ యాక్టింగ్‌ కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్‌ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్‌ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్‌ ఉండటం వల్ల కాస్త బోరింగ్‌ ఫీల్‌ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ పని తీరును మెచ్చుకోవాల్సిందే. 

    టెక్నికల్‌గా 

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రంజన్‌ రాజ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్‌ అయ్యింది. అటు జగదీష్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • ప్రధాన పాత్రల నటన
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • స్క్రీన్ ప్లే
    • బోరింగ్ సీన్లు

    రేటింగ్‌: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv