నేడు సీనియర్ నటి విజయశాంతి బర్త్‌డే. జూన్ 24, 1966న మద్రాసులో జన్మించింది. 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి సినిమా ఖిలాడి కృష్ణుడు. ఆమె నటనతో సూపర్‌స్టార్, లేడి అమితాబ్ అనే బిరుదులను తెచ్చుకుంది. అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే గుర్తొచ్చే పేరు విజయశాంతి. 40 ఏళ్ల ఇండస్ట్రీలో 187 సినిమాలు, ఎన్నో బెస్ట్ ఫర్ఫార్మెన్‌లు, నేషనల్ అవార్డులు, నంది అవార్డులు పొందింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి 2020లో మహేశ్‌బాబు సరిలేరు నీకెవ్వరులో ఒక కీలక పాత్రలో నటించింది. నేడు విజయశాంతి బర్త్‌డే సందర్భంగా ఆమె బెస్ట్ టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసుకుందా.
1.నేటి భారతం (1983)
మొదటిసారి విజయశాంతి దర్శకుడు టి.కృష్ణతో కలిసి నటించిన మూవీ నేటి భారతం. ఆ తర్వాత వారిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాతో మొదట విజయశాంతి పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది. విమర్శకుల ఆదరణతో పాటు, ఈ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో మూడు రాష్ట్ర నంది అవార్డులను కైవసం చేసుకుంది.
2.ప్రతిఘటన(1985)
ఈ సినిమాలో విజయశాంతి రాజకీయ నేతల అవినీతిపై పోరాడుతుంది. టి కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన ఉత్తమ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ నేపథ్య గాయని విభాగాలలో మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది. ఎస్ జానకి పాడిన “ఈ ధుర్యోధన దుశ్శాసన” పాట ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాతో ఆమె లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందింది.
3.స్వయంకృషి(1987)
కె. విశ్వనాథ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి విజయశాంతి నటించింది. ఒక చెప్పులు కుట్టేవాడి స్వయంకృషితో జీవితంలో ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా కథ. అతడి భార్య గంగగా విజయశాంతి నటించిన తీరు అందరినీ మెప్పించింది. శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. కథలో ఇమిడేలాగా ప్రేమ పాటలు, యాక్షన్ కూడా చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.
4.కర్తవ్యం(1990)
కర్తవ్యం సినిమాతోనే విజయశాంతికి లేడీ అమితాబ్ అనే బిరుదు వచ్చింది. ఈ మూవీలో ఆమె నటనకుగాను నేషనల్ అవార్డు లభించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నంది అవార్డు పొందింది. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్‌గా, ఎవరికి భయపడని ధీరవనితగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పించింది. ఈ స్టోరీ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేటి జీవితం ఆధారంగా తెరకెక్కింది.
5.ఒసేయ్ రాములమ్మ (1997)
ఒసేయ్ రాములమ్మ మూవీతో విజయశాంతికి రాములమ్మ అనే పేరు వచ్చింది. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతంలో దొరలు ప్రజలను బానిసలు చేసి మహిళల్ని ఎలా హింసించేవారో చూపించే కథ ఇది. ఈ సినిమాలో విజయశాంతి నటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. రాములమ్మ పాత్రలో జీవించిందనే చెప్పుకోవాలి. వందేమాతరం శ్రీనివాస్ అందించిన పాటలు ఈరోజుకు కూడా అందరికీ గుర్తుండిపోతాయి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!