దక్షిణాదిలో ‘లంగా వోణి’ వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు లోగిళ్లలో అయితే దీనిని మరింత సంబరంగా జరుపుకుంటారు. ఓ పెళ్లి వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా అలంకరణలు, హంగులూ, ఆర్భాటాలతో తమ గారాలపట్టి ‘లంగా వోణి’ ఫంక్షన్ గురించి నలుగురూ మాట్లాడుకునేలా నిర్వహిస్తారు. ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వేళ..తమ చిట్టితల్లి పెద్దది అయ్యింది..పెళ్లి ఈడుకొచ్చిందని బంధుగణానికి చాటేందుకు ఒకప్పుడు ఈ వేడుక జరిపేవారు. ఇప్పుడు అంత చిన్న వయసులో పెళ్లి చేయకపోయినా…సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అయితే ప్రత్యేక థీమ్స్, ఫోటోషూట్లతో ‘లంగా వోణి’ వేడుకను మరింత ప్రత్యేకంగా జరిపిస్తున్నారు. బాలికపై బంధువులు బహుమతుల వర్షం కురిపిస్తున్నారు. తమ గారాలపట్టికి చల్లని దీవెనలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా తల్లిదండ్రులు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏమివ్వాలనేది చాలామందిని తలలు పట్టుకునేలా చేస్తుంది. అందుకే మీ తలనొప్పి తగ్గించేందుకు మేమే కొన్ని గిఫ్ట్స్ ఎంపిక చేశాం. వాటిలో మీకు నచ్చేదేంటో చూడండి మరి..
పూజగది కోసం ఇత్తడి కంకవటి( కుంకుమ భరిణ )
కుంకుమ భరిణలు హిందూ సాంప్రదాయంలో సాధారణంగా ఇచ్చే కానుక. గణనాథుడితో అలంకరించిన ఇత్తడి కుంకుమ భరిణ ఒక చక్కని బహుమతిగా నిలుస్తుంది. పైగా గణనాథుడిని బహుమతిగా ఇస్తే ఇచ్చిన, పుచ్చుకున్న రెండు ఇళ్లలోనూ శుభం జరుగుతుందని చెబుతుంటారు.
లక్ష్మీ కుంకుమ భరిణ
గజరాజులు, లక్ష్మి ఉండే పసుపు, కుంకుమ భరిణ శుభప్రదమైన బహుమతి. ఇది ఇరు కుటుంబాల్లో ఆటంకాలను తొలగించి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని చెబుతుంటారు. పైగా ప్రతి ఇంట్లోనూ ఇది తప్పక అవసరం కూడా.
గిఫ్ట్ బాక్స్ తో ఉండే వెండి గిన్నె
స్వచ్ఛమైన లోహాల్లో వెండి ఒకటి. వెండి కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వ్యాపారవృద్ధి జరుగుతుందని చెబుతుంటారు. అందుకని ఈ వెండిపూతతో ఉన్న గిన్నెలు బహుమతిగా ఇస్తే ఆకర్షణీయంగానూ ఉంటుంది.
ఇత్తడి పూజా బుట్ట
పూజ బుట్ట ప్రతి ఇంట్లోనూ అవసరం. దీనిని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే వారు గుడికెళ్లిన ప్రతిసారీ మీ బిడ్డకు ఆశీర్వాదం దక్కినట్టే కదా.
ముత్యాల కుంకుమ భరిణ
మహిళలు అలంకార ప్రియులు, అలాగే కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. ఈ రెండు కలగలిసేలా ఉండే ముత్యాలతో అలంకరించిన కంకుమ భరిణ బహుమతిగా ఇస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతారో కదా.
నెమలి సొగసుల పొట్లి బ్యాగు
ఈ మధ్యకాలంలో ఒక చిన్న బ్యాగును చంకనేసుకుని చక్కగా అలంకరించుకోవడం మహిళల్లో సాధారణంగా మారింది. నెమలి సొగసులను అల్లికగా ఉన్న ఈ పొట్లి బ్యాగ్ మిమ్మల్ని అనుక్షణం గుర్తుచేసే బహుమతిగా మిగిలిపోతుంది.
కళంకారీ గాజుల డబ్బా
మహిళలు అంలకరణ వస్తువులే కాదు అవి దాచుకునే డబ్బాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. అన్ని ఫంక్షన్లలోనూ అతివల అందాన్ని రెట్టింపు చేసే గాజుల కోసం కళంకారీ వర్క్ తో ఉన్న బాక్స్ గిఫ్ట్ గా ఇస్తే అదిరిపోతుంది.
LED దీపకాంతుల రంగోళి
తెలుగు లోగిళ్లలో రంగవల్లి పిండి నుంచి పెయింట్ వరకు చేరింది. ఇప్పుడు మరింత ప్రకాశంగా ఉండేలా రెడీమేడ్ రంగవళ్లులు తెచ్చుకుంటున్నారు. ఎల్ఈడీ దీపాలతో ఉండే ఈ గిఫ్ట్ వారి ఇంటి వాకిలికే వన్నె తెచ్చేలా ఉంటుంది.
బంగారు, వెండి గిన్నెల సెట్
లక్ష్మీదేవికి ప్రతిరూపమైన బంగారం, వెండి కలగలసిన ఈ బంగారం వెండి గిన్నెల సెట్ ఏ వేడుకలోనైనా అద్భుతమైన బహుమతిగా నిలుస్తుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది