• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Laptops Under Rs.40,000: బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ కోసం వెతుకున్నారా?.. రూ.40 వేలలోపు టాప్‌ ఇవే!

    ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌ వినియోగం అనివార్యమైంది. వర్క్ ఫ్రం హోం (Work From Home) కారణంగా ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది లేనిదే పని నడవదు. అలాగే విద్యార్ధులకు కూడా ల్యాప్‌టాప్ తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆన్‌లైన్ తరగతులకు అటెండ్‌ అయ్యేందుకు ఇది తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో పలు కంపెనీలకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏదీ కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. మీ బడ్జెట్‌ రూ.40,000 అయితే ఆ రేంజ్‌లోని టాప్‌ ల్యాప్‌టాప్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

    Acer Aspire Lite 

    ఈ ల్యాప్‌టాప్‌ 15.6 అంగుళాల Full HD డిస్‌ప్లేను కలిగి ఉంది. Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై వర్క్‌ చేస్తుంది. Core I3 1115G4 సీపీయూ మోడల్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.44,990. అమెజాన్‌ దీనిపై 38% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా రూ.27,990 ఇది లభిస్తోంది. 

    HP 255 G8 Ryzen 5 Dual Core 

    మార్కెట్‌లో లభిస్తున్న మంచి ల్యాప్‌టాప్‌లో HP 255 G8 Ryzen 5 Dual Core ఒకటి. ఇది 15.6 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. Tablet Processorతో వర్క్ చేయనుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దీనికి అందించారు. 8GB RAM/256GB హార్డ్‌ డిస్క్‌ను ఈ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.34,490గా ఉంది. 

    Lenovo IdeaPad Slim 3 Intel Core

    ఇది 11th Gen Intel Core i3-1115G4  ప్రొసెసర్‌ను కలిగి ఉంది. Windows 11 Home 64 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 8GB RAM / 256GB SSD స్టోరేజ్‌ను దీనికి అందించారు. అమెజాన్‌లో రూ. 34,990 లకు ఈ ల్యాప్‌ టాప్ లభిస్తోంది. 

    HP Laptop 14s, AMD Ryzen 3 5300U

    HP ల్యాప్‌టాప్‌లకు మార్కెట్‌లో ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ.40 వేల లోపు బెస్ట్ HP ల్యాప్‌టాప్‌ను కోరుకునే వారు HP Laptop 14s, AMD Ryzen 3 5300U పరిశీలించవచ్చు. ఇది 14 అంగుళాల FHD స్క్రీన్‌ను కలిగి ఉంది. Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఇది వర్క్‌ చేయనుంది. 8GB RAM / 512GB స్టోరేజ్‌ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. అమెజాన్‌లో ఇది రూ.36,900కు అందుబాటులో ఉంది.

    HP 15s LAPTOP

    AMD Ryzen 3 5300U ప్రొసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్‌ వర్క్‌ చేయనుంది. 8GB RAM/512GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో దీన్ని రూపొందించారు. సిల్వర్‌ కలర్‌ ఆప్షన్‌లో ఇది లభిస్తుంది. HP 15s ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 50,565. అమెజాన్‌ దీనిపై 27% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.36,900 దక్కించుకోవచ్చు.

    Dell 15 Laptop

    మార్కెట్‌లో మంచి బ్రాండ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ కంపెనీల్లో డెల్‌ ఒకటి. ఈ కంపెనీకి చెందిన Dell 15 Laptopకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఇది 15.6 అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉంది. Windows 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వర్క్‌ చేయనుంది. ఇది 8 GB / 1 TB SSD హార్డ్‌ డిస్క్‌ను అందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv