వైర్లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వీటిపై యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని గుర్తించిన టెక్ సంస్థలు స్టైలిష్ లుక్‌తో ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. వివిధ ధరల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈ ఇయర్‌బడ్స్‌ను కొందరు వేలు పోసి కొంటుంటే మరికొందరు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్‌తో ఉన్న ఇయర్ బడ్స్ తీసుకుని ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మీరు కూడా మీ గ్యాంగ్‌లో ట్రెండ్ సెట్టర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ ఇయర్ బడ్స్ మీకోసమే..
Boult Audio W20
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇండియన్ బ్రాండ్ ఇయర్ బడ్స్‌లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. రూ.1000 లోపు ఇయర్‌బడ్స్‌లో ఇది ఫోల్డెబుల్ డిజైన్‌తో వన్ ఇయర్ వారంటీతో వస్తోంది. 35 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను కలిగి ఉంది. 13mm bass drivers, టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్, బ్యూటూత్ 5.3 వెర్షన్, టచ్ కంట్రోల్ ఆడియో లభిస్తుంది. దీని ద్వారా కాల్స్, మ్యూజిక్‌ను రెజ్యూమ్, స్కిప్ చేయవచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,499 కాగా.. అమెజాన్ దీనిపై 56% డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా రూ.1099కే ఈ ఇయర్‌బడ్స్ పొందవచ్చు.
Noise Buds VS104
అమెజాన్‌లో ఈ ఇయర్ బడ్స్ ఏకంగా 77శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. వీటి వాస్తవ ధర రూ.3499 కాగా ప్రస్తుతం ఇవి రూ.799కే లభిస్తున్నాయి. ఇక వీటి ఫీచర్ల విషయానికొస్తే.. 45 గంటల ప్లేబ్యాక్ టైమ్, కెవలం 10 నిమిషాల్లోనే ఇయర్ బడ్ కేస్ ఫుల్ ఛార్జ్ కావడం విశేషం. Ipx5 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి. దీనివల్ల చెమట వల్లగాని నీటి నుంచి రక్షణ లభిస్తుంది. టచ్ కంట్రోల్‌తో పాటు ఏడాది వారెంటీ ప్రొడక్ట్‌పై లభిస్తుంది.
Portronics Harmonics Twins S16
పోర్ట్రోనిక్స్ బ్రాండ్‌కు మంచి పేరుంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంటుంది. ఈ బ్రాండ్ నుంచి ఇయర్ బడ్స్ అమెజాన్‌లో చౌక ధలో లభిస్తున్నాయి. ఏకంగా 65 శాతం డిస్కౌంట్‌తో ఆఫర్లో ఉన్నాయి. వీటి ఫీచర్ల విషయానికొస్తే.. 24 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను కలిగి ఉంది. 13mm bass drivers, టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్, బ్యూటూత్ 5.3 వెర్షన్, టచ్ కంట్రోల్ ఆడియో, డిజిటల్ బ్యాటరీ డిస్ప్లే, మ్యూజిక్ మోడ్ అండ్ గేమింగ్ మోడ్ ప్రత్యేకతలు కలిగి ఉంది. దీని ద్వారా మ్యూజిక్‌ను, గేమింగ్ ఎక్స్ఫీరియన్స్ను ఎంజాయ్ చేయవచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.1999 కాగా.. అమెజాన్‌లో ఇది రూ.698కే లభిస్తోంది.
truke Buds F1 Ultra
దీని ఫీచర్లు ఎవరైనైనా ఔరా అనిపిస్తాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఏ ఇయర్ బడ్స్‌లో లేనటువంటి ప్రత్యేకతలు దీని సొంతం. స్పేషియల్ ఆడియే కాలింగ్‌ను ఇది ప్రొవైడ్ చేస్తోంది. ఫలితంగా గొప్ప ఆడియో అనుభూతి పొందవచ్చు. అలాగే 60 గంటల ప్లేబ్యాక్ టైం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, 13mm గ్రాఫిన్ స్పీకర్స్ దీని ప్రత్యేకతలు. దీని డిజైన్ కూడా యూత్ అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. దీని అసలు ధర రూ.2999 కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో 73శాతం డిస్కౌంట్‌పై లభిస్తోంది.
amazon basics
అమెజాన్ బెసిక్స్ బ్రాండింగ్‌తో వస్తున్న ఈ ఇయర్ బడ్స్‌పై మంచి సమీక్షలు అయితే ఉన్నాయి. 60 గంటల ప్లేబ్యాక్ టైం, IpX5 వాటర్ రెసిస్టెంట్, స్మార్ట్ టచ్ కంట్రోల్, నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని వాస్తవ ధర రూ.2499 కాగా 70శాతం డిస్కౌంట్‌తో రూ.749కే లభిస్తోంది.
Boat Airdopes 100
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రూ.1000 లోపు ఇయర్‌బడ్స్‌లో ‘Boat Airdopes 100’ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ఫోల్డెబుల్ డిజైన్‌తో వన్ ఇయర్ వారంటీతో వస్తోంది. 10 మీటర్ల రేంజ్, 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను కలిగి ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.4,490 కాగా.. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.1099కే ఈ ఇయర్‌బడ్స్ పొందవచ్చు.
Mivi duopods A25
తక్కువ బడ్జెట్లో లభిస్తోన్న మరో మంచి ఇయర్‌బడ్స్ ‘Mivi Duopods A25’. ఇది 40 గంటల ప్లేటైమ్తో పాటు Ipx4 వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన టచ్ కంట్రోల్స్, టైప్-C చార్జింగ్ స్లాట్ దీనికి అందించారు. దీని అసలు ధర రూ.2,999. అమెజాన్‌పై దీనిపై కూడా 60% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా దీన్ని రూ.1199కే దక్కించుకోవచ్చు.
Ptron BassBuds Plus
Ptron BassBuds Plusను కూడా ఏడాది వారంటీతో తీసుకొచ్చారు. 10 మీటర్ల రేంజ్, 12 గంటల ప్లేటైమ్‌ను ఫీచర్లుగా అందించారు. 300 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. Li-Polymerతో బ్యాటరీ తయారైంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,499. కానీ, అమెజాన్ దీనిపై 76% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ ఇయర్‌బడ్స్ కేవలం రూ.599కే అందుబాటులోకి వచ్చాయి.
Truke Buds S2 Lite
ట్రక్ బడ్స్ ఎస్2 లైట్‌ను 10 మీటర్ల రేంజ్‌తో తీసుకొచ్చారు. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 300 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. దీని అసలు ధర రూ.2,999. అమెజాన్ 70% రాయితీ ప్రకటించింది. కాబట్టి రూ.798కే దీన్ని పొందవచ్చు.
Wings Phantom 450
ఈ ఇయర్‌బడ్స్‌ను డిజిటల్ బ్యాటరీ డిస్ప్లేతో తీసుకొచ్చారు. Wings Phantom 450 ఏకంగా 50 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది. దీని ఒరిజినల్ కాస్ట్ రూ. 2,799. అమెజాన్ తన వినియోగదారులకు 64% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.999కే అందుబాటులోకి వచ్చింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్