• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Latest Telugu OTT Movies: ఈ వీకెండ్‌లో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? వీటిపై ఓ లుక్కేయండి!

    ఒకప్పుడు వీకెండ్‌ అంటే థియేటర్‌లు గుర్తుకు వచ్చేవి. ఏ సినిమా చూడాలా? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేవారు. అయితే ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే వెసులుబాటును ఓటీటీ కల్పిస్తోంది. ప్రతీవారం కొత్త సినిమాలు / సిరీస్‌లను తీసుకొస్తూ మీ ఇంటి వద్దకే వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారంతం (Weekend OTT Suggestions) పలు కొత్త చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని వీకెండ్‌లో చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. 

    ఆరంభం (Aarambham)

    మోహన్‌ భగత్‌, సుప్రీత, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. మే 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మే 23 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాను చూడాలనుకునేవారు వీకెండ్‌లో ఈ చిత్రాన్ని ఎంచక్కా చూసేయండి. ప్లాట్ ఏంటంటే.. మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.

    ప్రసన్నవదనం (Prasanna Vadanam)

    సుహాస్‌, నందు, పాయల్‌ రాధాకృష్ణ, రాశిసింగ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం.. థియేటర్లలో హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 24 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది. ప్లాట్ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.

    రత్నం (Rathnam)

    విశాల్‌ హీరోగా డైరెక్టర్‌ హరి (Weekend OTT Suggestions) కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. మే 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. ప్లాట్‌ ఏంటంటే.. రత్నం (విశాల్‌).. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జీవిస్తుంటాడు. జననీని (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అన్నది కథ.

    క్రూ (CREW)

    కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ తో పాటు సీనియర్ నటి టబు నటించిన చిత్రం ‘క్రూ‘ (Latest Telugu OTT Movies). థియేటర్ లో భారీ కలెక్షన్స్ తో పాటు భారీ స్పందన పొందిన ఈ సినిమా మే 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ భాషలో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. ‘జాస్మిన్‌ (కరీనా), గీతా (టబు), దివ్య (కృతి సనన్‌) కోహినూర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా చేస్తుంటారు. ఆర్థిక సమస్యల వల్ల యాజమాన్యం కొన్ని నెలలుగా వారికి జీతాలు చెల్లించదు. ముగ్గురికి డబ్బు అవసరం పడటంతో దాన్ని సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. చివరికీ ఏమైంది? అన్నది కథ.

    ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (Aquaman and the lost kingdom)

    గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ హాలీవుడ్‌ చిత్రం (Weekend OTT Suggestions).. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మే 21 నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌స మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళం భాషలలో అందుబాటులో ఉంది. ‘ఆర్థర్‌ కర్రీ (జాసన్‌ మోమోయ్‌).. సోదరుడు ఓరమ్‌ను ఓడించి ట్రైడెంట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అట్లాంటిస్‌ రాజు అవుతాడు. మరోవైపు తన తండ్రి చావుకు కారణమైన ఆర్థర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సముద్రపు దొంగ డేవిడ్‌ బయలుదేరుతాడు. ఓ గుహలోకి వెళ్లిన అతడికి అద్భుతమైన శక్తులు ఉన్న బ్లాక్‌ ట్రైడెంట్‌ దొరుకుతుంది. దాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత డేవిడ్‌ ఎలా మారాడు? అతడికి లభించిన శక్తులు ఏమిటి? డేవిడ్ దుశ్చర్యలను ఆర్థర్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.

    విద్య వాసుల అహం (Vidya Vasula Aham)

    రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. పెళ్లైన జంటల మధ్య అహంతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం గత వారం మే 17న ఆహాలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. లాస్ట్‌ వీక్‌ మిస్‌ అయ్యి ఉంటే ఈ వారం ఈ సినిమాను చూసేయండి. 

    షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai)

    గతం వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఫీల్‌ గుడ్‌ మూవీ ఇది. చైతన్యరావు, భూమి శెట్టి జంటగా చేశారు. కుమారస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఆహా వేదికగా మే 18 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది. గత వారం ఈ మూవీ చూడలేకపోయిన వారు.. ఈ వీక్‌ చూడండి. సినిమా కథ విషయానికి వస్తే.. ‘చిరంజీవి, విజయ మధ్య తరగతి భార్య భర్తలు. చైన్‌ సిస్టమ్‌ బిజినెస్‌ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంతకీ ఆ బోగస్‌ కంపెనీ ఎవరిది? తన డబ్బులు పోయాయని తెలిసిన చిరంజీవి ఏం చేశాడు? ఈ మోసానికి కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధం ఏంటి?’ అన్నది ప్లాట్‌.

    చోరుడు (Chorudu)

    జి.వి ప్రకాష్‌, ఇవానా జంటగా నటించిన తమిళ డబ్బింగ్‌ చిత్రం ‘చోరుడు‘ (Latest Telugu OTT Movies). పి.వి. శంకర్‌ దర్శకత్వం వహించాడు. మే 14 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో చోరుడు చూసేయచ్చు. సినిమా కథ విషయానికి వస్తే.. ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.

    ఆవేశం (Aavesham)

    పుష్ప’ ఫేమ్‌ ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో చేసిన మలయాళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆవేశం‘. ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మే 17నుంచి ఈ సినిమా తెలుగులో అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘కేరళకు చెందిన ముగ్గురు బెంగళూరులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరతారు. ఓ రోజు సీనియర్లు వారిని ర్యాగింగ్‌ చేసి అవమానిస్తారు. దీంతో ప్రతీకారం కోసం వారు మలయాళీ లోకల్‌ గుండా రంగా (ఫహద్‌ ఫాసిల్‌)తో పరిచయం పెంచుకుంటారు. అనూహ్య ఘటనల తర్వాత రంగ వారు రంగాకు శత్రువులుగా మారతారు? ఆ తర్వాత ఏమైంది? రంగా వారిని ఎందుకు చంపాలనుకున్నాడు?’ అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv