• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava Blaze 2 5G: రూ.10 వేలకే సరికొత్త 5G మెుబైల్.. ఫిదా చేస్తున్న ఫీచర్లు..!

    దేశీయ కంపెనీ లావా (Lava) మరో సరికొత్త 5జీ మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గతంలో బ్లేజ్‌ 2 పేరిట ఓ 4జీ (Lava Blaze 2 4G) ఫోన్‌ను విడుదల చేసిన ఆ కంపెనీ.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘Lava Blaze 2 5G’ పేరుతో కొత్త మెుబైల్‌ను పరిచయం చేసింది. బడ్జెట్‌లో 5G మెుబైల్‌ను కోరుకునేవారికి ఈ మెుబైల్‌ మంచి ఆప్షన్‌ లావా చెబుతోంది. ఇందులోని ఫీచర్లు టెక్‌ ప్రియులకు కచ్చితంగా నచ్చుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? కెమెరా, బ్యాటరీ ఇతర విశేషాల గురించి ఈ కథనంలో చూద్దాం. 

    ఫోన్ స్క్రీన్‌

    లావా బ్లేజ్‌ 2 5జీ (Lava Blaze 2 5G) స్మార్ట్‌ఫోన్‌.. 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ IPS LCD డిస్‌ప్లేతో రానుంది. దీనికి 90Hz రిఫ్రెష్ రేటును అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటి 6020 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ మెుబైల్‌ వర్క్‌ చేస్తుంది. మెుబైల్‌ను ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

    ర్యామ్‌ & స్టోరేజ్

    ఈ మెుబైల్‌ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. 4GB ర్యామ్ + 64జీబీ స్టోరేజ్,  6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. మీ అవసరానికి అనుగుణంగా ర్యామ్‌, స్టోరేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

    బ్యాటరీ

    Lava Blaze 2 5G స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఈ మెుబైల్‌కు 5,000mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. ఫలితంగా ఫోన్‌ను ఫాస్ట్‌గా ఛార్జ్‌ చేసుకోవచ్చని లావా వర్గాలు పేర్కొన్నాయి. 

    కెమెరా నాణ్యత

    Blaze 2 5G ఫోన్‌ను బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నప్పటికీ కెమెరా నాణ్యత విషయంలో లావా రాజీ పడలేదు. వెనుక భాగంలో 50 MP ప్రైమరీతో కూడిన డ్యూయల్‌ రియల్‌ కెమెరా సెటప్‌ను అందించింది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. వెనుక కెమెరాతో 2K రిజల్యూషన్‌ వరకు వీడియోను రికార్డు చేయొచ్చని కంపెనీ చెబుతోంది. కెమెరా చుట్టూ రింగ్‌ లైట్‌తో వస్తోంది.

    అదనపు ఫీచర్లు

    వైఫై5, బ్లూటూత్‌ 5.0, 3.5mm జాక్‌తో వస్తున్న ఈ ఫోన్‌.. ఎనిమిది 5జీ బ్యాండ్లకు సపోర్ట్‌ చేస్తుంది. 8.33 ఎంఎం మందం కలిగిన ఈ లావా మెుబైల్‌ 203 గ్రాముల బరువు ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ దీనికి అమర్చారు. 

    ఫోన్‌ కలర్స్

    ఈ లావా మెుబైల్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. గ్లాస్‌ బ్లాక్‌ (Glass Black), గ్లాస్‌ బ్లూ (Glass Blue), గ్లాస్‌ ఆరెంజ్‌ (Glass Orange) రంగుల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    Lava Blaze 2 5G 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధరను రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా పేర్కొంది. నవంబర్‌ 9 నుంచి ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌లో లేదా దగ్గర్లోని రిటైల్‌ స్టోర్లలో మెుబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv