• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava Blaze Pro 5G: చౌక ధరలో లావా నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రముఖ దేశీయ మెుబైల్‌ తయారీ కంపెనీ లావా (LAVA)కు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది.ఈ కంపెనీ తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన ఫోన్లను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియుల మన్ననలు అందుకుంటోంది. ఈ కంపెనీ రిలీజ్ చేసే ఫోన్లకు యూజర్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో టెక్ లవర్స్‌ ఈ కంపెనీ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లావా మరో సరికొత్త ఫోన్‌ను లాంఛ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘లావా బ్లేజ్‌ ప్రో’ (Lava Blaze Pro) పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. సెప్టెంబర్‌ 26వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    Lava Blaze Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.56 అంగుళాల IPS స్క్రీన్‌తో తీసుకొస్తున్నారు. ఇది 1920 x 1080 పిక్సెల్‌ క్వాలిటీని కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్‌ రేట్‌ను ఫోన్‌కు అందించారు. Android v13, Dimensity 6020, Octa Core ప్రొసెసర్‌తో ఈ ఫోన్‌ వర్క్‌ చేయనుంది.

    స్టోరేజ్‌ సామర్థ్యం

    Lava Blaze Pro 5G మెుబైల్‌ను 4 GB RAM/128 GB స్టోరేజ్‌ సామర్థ్యంతో తీసుకొస్తున్నారు. MicroSD కార్డు ద్వారా ఫోన్‌ స్టోరేజ్‌ను 1TB వరకూ పెంచుకోవచ్చు. 

    బిగ్‌ బ్యాటరీ

    ఈ ఫోన్‌కు శక్తివంతమైన బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. 5000mAh బ్యాటరీని Lava Blaze Pro 5G స్మార్ట్‌ఫోన్‌కు అందించారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీని ద్వారా మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కెమెరా క్వాలిటీ

    తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను తీసుకొస్తున్నప్పటికీ కెమెరా నాణ్యత విషయంలో లావా రాజీ పడలేదు. 50 MP + 2 MP డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను ఫోన్‌కు అందించింది. అలాగే ఫ్రంట్‌ సైడ్‌ 8 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేసింది. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    మెుబైల్ కలర్స్

    Lava Blaze Pro 5G మెుబైల్‌ను 2 కలర్‌ ఆప్షన్స్‌లో లావా తీసుకొస్తోంది. బ్లాక్‌ (Black), వైట్‌ షేడ్‌ (White shade) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    Lava Blaze Pro 5Gను రూ.15 వేల లోపే తీసుకొస్తున్నట్లు తాజాగా లాంఛ్‌ చేసిన ఫోన్‌ టీజర్‌లో లావా పేర్కొంది. కానీ, ధరపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఫోన్‌ రూ.12,999కి అందుబాటులోకి వస్తుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గం.లకు యూట్యూబ్‌ వీడియో ద్వారా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు లావా స్పష్టం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv