• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Lava Storm 5G: లావా నుంచి మరో అద్భుతమైన 5జీ బడ్జెట్ ఫోన్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    ప్రముఖ స్వదేశీ మెుబైల్‌ తయారీ సంస్థ లావా (Lava) మరో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ‘Lava Storm 5G’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌ 21న ఈ ఫోన్‌ భారత మార్కెట్‌లో సందడి చేయనుందని లావా స్పష్టం చేసింది. టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో ఫీచర్లు ఈ మెుబైల్‌లో ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.

    మెుబైల్‌ స్క్రీన్‌

    Lava Storm 5G మెుబైల్‌.. 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానుంది. LCD ప్యానెల్‌తో కూడిన ఈ మెుబైల్‌ స్క్రీన్‌కు 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ ప్రొసెసర్‌పై వర్క్‌ చేయనుంది. 

    ర్యామ్ & స్టోరేజీ

    ఈ Lava Storm 5G డివైజ్.. 8GB RAM / 256GB స్టోరేజీ వేరియంట్‌లో లాంచ్ కానుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16GB వరకూ పెంచుకునే అవకాశముంది. ఇతర ర్యామ్‌ & మెమొరీ వేరియంట్లలోనూ ఫోన్‌ లభించే అవకాశం ఉంది. లాంచింగ్‌ రోజున దీనిపై స్పష్టత రానుంది.

    కెమెరా

    లావా స్టోర్మ్‌ మెుబైల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌ ఉన్నట్లు సమాచారం. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో  8MP కెమెరాను అందించారు. 

    బ్యాటరీ

    ఈ నయా స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీనికి 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. దీని సాయంతో మెుబైల్‌ను త్వరితగతిన ఛార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 

    కలర్‌ ఆప్షన్స్‌

    Lava Storm 5G డివైజ్ రెండు కలర్‌ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌ (Black), గ్రీన్‌ (Green) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుందని లావా ప్రకటించింది. ఆ రోజే ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ఫోన్‌ రూ.15,000 లోపే ఉండవచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv