దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘లావా యువ 3 (Lava Yuva 3) పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో వచ్చిన లావా యువ 2 (Lava Yuva 2), లావా యువ 3 ప్రో (Lava Yuva 3 Pro) మొబైల్స్‌కి యూజర్లలో మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో ఆ సిరీస్ నుంచే ఈ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎన్నో అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరిచినట్లు లాంచింగ్ సందర్భంగా లావా ప్రతినిధులు ప్రకటించారు. మరి ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలు ఏంటి? ధర, ఫీచర్ విశేషాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
మెుబైల్ స్క్రీన్
ఈ లావా మెుబైల్.. 6.5 అంగుళాల HD+ స్క్రీన్‌తో తీసుకొచ్చారు. 720 x 1,600 pixels క్వాలిటీ, 90Hz రిఫ్రెష్ రేటును అందించారు. గత మెుబైల్స్ Android 13 OSతో మార్కెట్ లాగా తాజా మెుబైల్ Android 14 అప్‌డేట్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. octa-core Unisoc T606 SoC ప్రొసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది.
ర్యామ్ & స్టోరేజ్
Lava Yuva 3 మెుబైల్.. స్టోరేజ్ ఆధారంగా రెండు వేరియంట్లో భారత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మెుబైల్‌ను 4GB + 64GB, 4GB + 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో మెుబైల్ పొందవచ్చు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4GB వరకూ పెంచుకోవచ్చు. అంటే 8GB RAMను ఉపయోగించుకోవచ్చు.
బిగ్ బ్యాటరీ
లావా యువ 3 మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5000mAh బ్యాటరీని ఫోన్‌కు అందించారు. ఈ సెగ్మెంట్‌లో వచ్చిన ఇతర బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే Lava Yuva 3 వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
కెమెరా క్వాలిటీ
Lava Yuva 3 కెమెరాల విషయానికి వస్తే.. ఈ మెుబైల్‌ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. 13MP ప్రైమరీ కెమెరా + AI ఆధారిత సెన్సార్ + VGA సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ముందు వైపు 5MP కెమెరాను ఫిక్స్ చేశారు. ఈ కెమెరాలతో నాణ్యమైన, ఫొటోలు వీడియోలు తీసుకోవచ్చని లావా వర్గాలు తెలిపాయి.
అదనపు ఫీచర్లు
ఈ లావా మెుబైల్ 4G నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఇందులో WiFi, GPS, Bluetooth 5.0, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ (Side-mounted Fingerprint Scanner), 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
Lava Yuva 3 మెుబైల్.. మూడు కలర్ వేరియంట్లలో దేశంలోకి లాంచ్ అయ్యింది. కాస్మిక్ లవెండర్ (Cosmic Lavender), ఎక్లిప్స్ బ్లాక్ (Eclipse Black), గెలాక్సీ వైట్ షేడ్స్ (Galaxy White shades) రంగుల్లో ఈ ఫోన్‌ను పొందవచ్చు.
ధర ఎంతంటే?
Lava Yuva 3 మెుబైల్ ధరను వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించింది. 4GB RAM + 64GB ROM వేరియంట్ ధర రూ.6,799గా కంపెనీ ప్రకటించింది. 4GB+128GB స్టోరేజ్ ధరను రూ.7,299గా నిర్ణయించింది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్‌లో మెుబైల్ విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10 నుంచి లావా ఇ-స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!