• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LG Gram Fold Laptop: ఎల్‌జీ నుంచి తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌.. ఫీచర్స్, ధర చూస్తే మతిపోవాల్సిందే..!

    ప్రముఖ టెక్‌ దిగ్గజం ఎల్‌జీ (LG) సరికొత్త ల్యాప్‌టాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘LG Gram Fold’ పేరుతో తన తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ఫోల్డ్‌ ల్యాపీలు ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత్‌ సహా అన్ని దేశాల్లో ఇవి విక్రయానికి రానున్నాయి. ఇంటెల్‌ లేటెస్ట్‌ 13 జనరేషన్‌ ప్రొసెసర్‌తో తయారైన తొలి ల్యాప్‌టాప్‌ కావడంతో దీనిపై టెక్‌ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘LG Gram Fold’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

    ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌

    ఈ ల్యాప్‌టాప్‌ ఫోల్డబుల్‌ స్క్రీన్‌ను 3:2 నిష్పత్తితో తీసుకొచ్చారు. ఇది మెుత్తంగా 17 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 2560 x 1920 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందించారు. ఈ ల్యాప్‌ను మడతబెట్టి రెండు భాగాలుగా చేయవచ్చు. ఫోల్డ్‌ చేసిన భాగం 12 అంగుళాలు స్క్రీన్‌ కలిగి ఉంటుంది. అంటే దీన్ని మడతపెట్టినప్పుడు 12 అంగుళాల ల్యాప్‌టాప్‌గా, విప్పినప్పుడు 17 అంగుళాల టాబ్లెట్‌గా మారిపోతుంది.

    టెక్నికల్‌ ఫీచర్స్

    LG Gram Fold ల్యాప్‌టాప్‌ను 13th generation Intel Core i5-1335U ప్రొసెసర్‌తో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక ఇది 72 watt battery బ్యాటరీని కలిగి ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.  Dolby Atmos సౌండ్‌ సిస్టమ్‌ ఇందులోని మరో ప్రత్యేకత

    స్టోరేజ్‌ సామర్థ్యం

    LG Gram Fold ల్యాప్‌టాప్‌ 16GB RAM / 512GB SSD స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గేమింగ్స్, ఎడింటింగ్ కోసం  Iris Xe graphics ఇందులో ప్రధాన ఫీచర్‌గా ఉంది. వీటితో పాటు 3 stereo speakers, Bluetooth 5.1, Wi-Fi 6E, 2 USB-C ports ల్యాప్‌కు అందించారు. 

    కీ బోర్డ్‌ 

    ‘LG Gram Fold’ ల్యాప్‌టాప్‌ను మడతపెట్టిన తర్వాత అడుగు భాగం స్క్రీన్‌ను కీ బోర్డ్‌గా వినియోగించవచ్చు. లేదంటే బ్లూటూత్‌ ద్వారా వైర్‌లెస్‌ కీబోర్డ్‌ను కనెక్ట్‌ చేసుకొని ఒరిజినల్‌ ల్యాప్‌టాప్‌ అనుభవాన్ని పొందవచ్చు.

    వెబ్‌ కెమెరా

    ఆన్‌లైన్‌ వీడియో కాల్స్‌కు కూడా ఈ ల్యాప్‌టాప్‌ చక్కగా పనిచేస్తుంది. Full-HD webcam ఈ ల్యాప్‌టాప్‌కు అందించారు. అలాగే 65W power adapterను ఇది కలిగి ఉంది.

    బుక్‌ రీడింగ్‌

    పుస్తక ప్రియులకు ఈ ల్యాప్‌టాప్‌ చాలా సౌకర్యంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ లాప్‌టాప్‌లో డిజిటల్‌ బుక్స్‌ను చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఈ ల్యాపీని ఫోల్డ్‌ చేసి డిజిటల్‌ బుక్‌ను ఓపెన్‌ చేస్తే అది నిజమైన పుస్తకాన్ని తలపిస్తుంది. 

    పెయింటింగ్స్‌

    కాలక్షేపానికి ఈ ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన పెయింటింగ్స్‌ కూడా వేసుకోవచ్చు. డిజిటిల్‌ పెన్‌ ద్వారా మీకు కావాల్సిన చిత్రాన్ని డిజిటల్‌గా రూపొందించవచ్చు. దీనికోసం ఇందులో ప్రత్యేకంగా పెయింటింగ్‌ యాప్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించారు. 

    ధర ఎంతంటే?

    ప్రస్తుతం ‘LG Gram Fold’ ల్యాప్‌టాప్‌ విక్రయాలు దక్షిణ కొరియాలో మాత్రమే మెుదలయ్యాయి. అది కూడా పరిమిత సంఖ్యలో LG స్టోర్లలో మాత్రమే వీటిని అమ్ముతున్నారు. అక్కడ ఈ ల్యాపీ ప్రమోషనల్‌ ప్రైస్‌ $2,982 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 2.48,159 అన్నమాట. భారత్‌లో ఈ ల్యాప్‌టాప్‌ ధర ఇంచుమించుగా అదే ప్రైస్‌ ఉండొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv