• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు..

    డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి

    సంగీతం: మణికాంత్‌ ఖాద్రి

    సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ

    నిర్మాత : గణేష్‌ పాపన్న

    విడుదల తేదీ: 22-03-2024

    యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌ శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ
    • త్రిగుణ్‌, జయశ్రీ నటన
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • స్క్రీన్‌ ప్లే
    • సాగదీత సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv