ఒక సాధారణ బెంగాళీ కుటుంబంలో పుట్టి విశ్వసుందరిగా ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందాల తార సుష్మితా సేన్. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 1975 నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన ఈ సుందరి అందం, అభినయంతోనే కాదు వ్యక్తిత్వం, భావజాలంతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు మీకోసం.
వృత్తి జీవితం
1994లో ఫెమీనా మిస్ ఇండియా ఇండియా యూనివర్స్ కిరీటం
1994 విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు
2016లో మిస్ ఇండియా జడ్జిగా రికార్డు
నటిగా బీవీ నం.1, ఫిల్హాల్, మైనే ప్యార్ క్యూ కియా, సిర్ఫ్ తుమ్, మై హూనా సినిమాలతో మెప్పించారు. తన అందం, అభినయంతో ఎంతోమంది మనసులు దోచుకున్నారు.
తాజాగా ‘ఆర్య’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ఓటీటీలో ఉత్తమ నటిగా అవార్డు
మరిచిపోలేని సుష్మితా సేన్ మాటలు
నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా కానీ అది ఈ వయసులోనే జరగాలనేం లేదు.
నా వృత్తికి అవతల నేనేం చేస్తాననేది అనవసరం. అది పెళ్లైనా, గర్భమైనా.
మహిళా సాధికారత కోసం పోరాడటంపై నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మనం అలా పోరాడుతున్నాం అంటే బలహీనంగా ఉన్నామని ఒప్పుకోవడమే.
ఓటమిని అధిగమించాలనుకునే వారు ఓడిపోతూనే ఉంటారు. తప్పులు చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి.
నేనేప్పటికీ తల్లినే. చిన్నపుడు నా తమ్ముడికి. ఇప్పుడు నా తల్లిదండ్రులకు. అంతెందుకు నా బాయ్ ఫ్రెండ్స్ కు కూడా నేను మాతృత్వాన్ని చూపించా.
ప్రేమంటే తీసుకోవడం కాదు ఇవ్వడం. ఇది కొంచెం కష్టమే కానీ అనుసరిస్తే అసలైన ప్రేమను ఆస్వాదించగలుగుతారు.
నన్ను ‘గోల్డ్ డిగ్గర్’ అంటున్నారు, కానీ బంగారం కన్నా వజ్రాలు అంటేనే నాకు ఎక్కువ ఇష్టం నేను వాటిని కొనుక్కోగలను కూడా.
వ్యక్తిత్వం వ్యక్తిగతం
సుష్మితా సేన్ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుతోంది. మాతృత్వానికి పెళ్లితో సంబంధం లేదనే తన వ్యక్తిత్వానికి ఇది అద్దం పడుతోంది.
సుష్మితా సేన్ కు అడిసన్స్ డిసీజ్ ఉంది దీని కారణంగా ఆమె జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.
సుష్మితా గత ప్రేమలు
తాజాగా లలిత్ మోదీతో వ్యవహారంతో వార్తల్లో నిలిచిన సుష్మితా సేన్ పై గతంలోనూ చాలా ప్రేమలు, డేటింగ్ పుకార్లు వచ్చాయి వారెవరో ఓసారి చూద్దాం.
రోహ్ మన్ షాల్
రణ్ దీప్ హుడా
విక్రమ్ భట్
రితిక్ భాసిన్
సంజయ్ నారంగ్
వసీమ్ అక్రమ్
ముదసర్ అజీజ్, బంటీ సచ్ దేవ్ తోనూ సుష్మితా ప్రేమాయణం సాగించిందని చెబుతారు.
ఏది ఏమైనా సుష్మితా సేన్ ఓ దృఢమైన వ్యక్తిత్వం గల మహిళ. ఎన్నో పుకార్లను, మరెన్నో ఆటు పోట్లను ధైర్యంగా ఎదుర్కుని చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పక్కవాళ్ల జీవితాన్ని పక్కనబెట్టి పనికొచ్చే విషయాలపై దృష్టిసారించాలని ఆమె ఎప్పుడూ చెప్పే మాట. అది కూడా కొంత నిజమేగా మరి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!