నటీనటులు: నవదీప్, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్, భావన సాగి, మిర్చి కిరణ్, అక్షయ్ డోగ్రా తదితరులు
దర్శకుడు: అవనీంద్ర
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత్
సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్
ఎడిటింగ్: అవనీంద్ర
నిర్మాణ సంస్థ : సి స్పేస్
విడుదల తేదీ: జూన్ 7, 2024
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli Review). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. నవదీప్ 2.0 అంటూ వినూత్నమైన ప్రమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ‘లవ్ మౌళి’.. నవ్‌దీప్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? యూత్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
మౌళి పాత్రలో నటుడు నవదీప్ కొత్త కోణంలో కనిపిస్తాడు. అతడి లుక్‌తో పాటు నటనలోనూ వైవిద్యం కనిపించింది. సమాజపు కట్టుబాట్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బతికే యువకుడి పాత్రలో అతడు చక్కటి నటన కనబరిచాడు. కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఆకట్టుకుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. గ్లామర్ పండిస్తూనే నటనలోనూ వేరియేషన్స్ చూపించింది. ఇక అఘోరాగా గెస్ట్ పాత్రలో కనిపించి రానా అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అవనీంద్ర.. యూత్‌ను టార్గెట్ చేస్తూ బోల్డ్ లవ్‌స్టోరీగా ‘లవ్ మౌళి’ని తెరకెక్కించారు. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వయంగా సృష్టించుకునే శక్తి ఓ యువకుడి వస్తే ఎలా ఉంటుందన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌తో.. కథను రొమాంటిక్‌గా నడిపించారు డైరెక్టర్. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. మౌళి లైఫ్‌లోకి చిత్ర వచ్చినప్పటికీ నుంచి అసలు కథ మెుదలవుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్, ఘర్షణలు రొటిన్‌గా అనిపిస్తాయి. అవసరం లేకున్నా వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్‌ను కూడా చాలా సాధారణంగా ముగించాడు. ఓవరాల్‌గా నవదీప్ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు డైరెక్టర్.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన దర్శకుడు అవనీంద్ర అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరామెన్ అజయ్ శివశంకర్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్‌ను చాలా సహజంగా, చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- నవదీప్, పంకూరి గిద్వానీ నటన
- ఎమోషనల్ సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఆసక్తిగా సాగని కథనం
- బోరింగ్ సన్నివేశాలు
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్