అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్ కొన్ని మీకోసం.
మాష్టారు మాష్టారు…
ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్ చిత్రంలోని “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్‌లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై ప్రేమని చెప్పే పాటనే. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
సామీ సామీ…
అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని సామీ సామీ అంటూ సాగే పాట ఈ కోవలోకి వస్తుంది. పుష్ప గురించి హీరోయిన్ పాడే ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఇన్‌స్టాలో చేయని రీల్ లేదు. చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. దేవీ శ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సాంగ్ ఇది.
ప్రియతమా ప్రియతమా..
మజిలీ చిత్రంలోని ప్రియతమా ప్రియతమా అనే పాట ఇటీవల విడుదలైన బెస్ట్ లవ్ సాంగ్. నాగ చైతన్య తన ప్రేమని అర్థం చేసుకోవాలనే ఆశతో సమంత పాడుతుంది. ఈ పాట ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిందనే చెప్పాలి. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఉండిపోవ నువ్విలా..
సవారి చిత్రంలోని “ఉండిపోవ నువ్విలా రెండు కళ్ల లోపలా” అనే పాట ఇటీవల వచ్చిన పాటల్లో సూపర్ హిట్ అయ్యింది. అబ్బాయి మీద ప్రేమని వర్ణిస్తూ పాడిన పాట చాలామంది హృదయాల్ని తాకిందని చెప్పవచ్చు.
మనసున ఉన్నది…
తరుణ్, స్నేహ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియమైన నీకు చిత్రంలోని “మనసున ఉన్నది చెప్పాలనున్నది” ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్. ప్రేమించే అబ్బాయి గురించి మనసులో దాగున్న విషయాలను చెప్పలేకపోతున్నట్లుగా సాగే ఈ పాట సూపర్ హిట్. ఈ సినిమాకు శివశంకర్ సంగీతం అందించారు.
ఇంతకీ నువ్వెవరు?…
నాని నటించిన స్నేహితుడు చిత్రంలోని “ఇంతకీ నువ్వెవరు వరుసకి నాకెవరు” అంటూ అబ్బాయి కోసం అమ్మాయి పాడే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్. అనుకోని సమస్యల్లో చిక్కుకున్న తనకి సాయం చేస్తున్న అబ్బాయి గురించి హీరోయిన్ పాడుతుంది. శివరాం శంకర్ సంగీతం అందించారు.
కోపమా నాపైనా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష జంటగా తెరకెక్కిన లవ్, రొమాంటిక్ సినిమా వర్షం లోని “కోపమా నాపైనా ఆపవా ఇకనైనా” అంటూ సాగే పాట ట్రెండ్ సెట్టర్. అమ్మాయిపై అలిగిన హీరో కోసం పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ సంగీతం అందించగా శ్రేయ గోషాల్ పాడారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం