పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుందనే నేపథ్యంలో వచ్చిన సినిమా మళ్లీ మొదలైంది. ఈ మూవీలో హీరో సుమంత్ సరసన నైనా నటించగా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో విడాకులు తీసుకున్న తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయో దర్శకుడు TG కీర్తి కుమార్ తనదైన శైలిలో చక్కగా చూపించారు. విడిపోయిన తర్వాత మరొకరిని మళ్లీ ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా, పెళ్లైన తర్వాత మళ్లీ విడాకులు అవుతాయా అనే ప్రశ్నలను సమాధానం ఈ మూవీలో పద్దతిగా చూపించారు. మరోవైపు నటినటులు కూడా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
ఇక కథలోకి వెళ్తే చెఫ్ విక్రమ్ (సుమంత్ కుమార్) సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన అతడు నిషా (వర్షిణి సౌందరరాజన్)ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మధ్య ఏర్పడిన మనస్పర్థలతో సంతోషంగా లేమని భావించి, కలిసి జీవించే బదులు పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత వారు జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఆలోచనలు వస్తుంటాయి. ఈ క్రమంలో విడాకుల న్యాయవాది పవిత్రను విక్రమ్ ప్రేమిస్తాడు. కాని వివాహం చేసుకుంటే మళ్లీ గొడవలు వస్తాయా అనే భయాందోళనలు తలెత్తుతాయి. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన మానసిక సంఘర్షణ నేపథ్యంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారా లేదా అనే విషయాలు సినిమాలోనే చూడాలి.
టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో జీ5 ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందని చెప్పవచ్చు. రోటిన్ కథలకు భిన్నంగా వచ్చిన ఈ మూవీ వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయనే అనే అంశాలు చూపించారు. మరోవైపు డివోర్స్ తర్వాత మళ్లీ మ్యారేజ్ చేసుకోవాలా లేదా, మనసిక ఒత్తిడి, ఆలోచనల తీరు, భయాందోళన వంటి వాటిని ప్రథమార్థంలో చక్కగా ప్రస్తావించారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత హీరో విడాకుల న్యాయవాదితో ప్రేమలో పడతాడు.
తన ప్రేమను విడాకుల లాయర్ అంగీకరిస్తుందా లేదా అనే క్రమంలో ఆమె పెళ్లి గురించి హీరోని అడుగుతుంది. కాని విక్రమ్ సందిగ్ధంలో ఉంటాడు. ఈ నేపథ్యంలో మరో న్యాయవాది(పోసాని కృష్ణ మురళి) రెండో పెళ్లి గురించి హీరోకి చక్కగా వివరిస్తాడు. తాను చెప్పే కొన్ని అంశాలు ఆలోచింపజేస్తాయి. ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న కారణాలకు గొడవలు పడి విడిపోతే ఎదురయ్యే పరిస్థితులు, సర్ధుకుని జీవిస్తే ఉండే విధానంను చివరగా పోసాని వెల్లడిస్తాడు. సినిమాలో పలు చోట్ల కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కాని సినిమా కథనం, సంభాషణలు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. మరోవైపు అనూప్ రూబెన్స్ సంగీతంలో సిద్ శ్రీరామ్ అందించిన అలోన్ అలోన్ ట్రాక్ కూడా స్పెషల్ అని చెప్పవచ్చు.
ఇక ఈ పాత్రకు సుమంత్ సరిగ్గా సరిపోయాడని చెప్పవచ్చు. తన క్యారెక్టర్ విక్రమ్ పాత్రలో అవసరమైన మేరకు భావోద్వేగాలను పండించాడు. పెళ్లై విడాకులు తీసుకున్న తర్వాత ఉండే ఒత్తిడికి తగిన విధంగా సుమంత్ నటించి అదరగొట్టాడు. హీరోయిన్ నైనా గంగూలీ పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఇక వర్షిణి కూడా తన పరిధి మేరకు చక్కగా నటించింది. మరోవైపు వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో హాస్యం పండించాడు. ప్రేమ పార్కులో నడవడం లాంటిదని, కాని మీది జురాసిక్ పార్క్ లాగా మారిందనే పంచులు వేసి సందడి చేశాడు. తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
రేటింగ్ 2.5/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!