• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Mark Antony Review In Telugu: సింపుల్ కథతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్

  తారాగణం

  నటీనటులు : విశాల్, రీతూ వర్మ, SJ సూర్య,  సునీల్, సెల్వ రాఘవన్, కార్తీ, అభినయ ఇతరులు

  డైరెక్టర్: ఆధిక్ రవిచంద్రన్

  కెమెరా : అభినందన్ రామానుజం

  సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్

  నిర్మాత : ఎస్. వినోద్ కుమార్

  విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2023

  తెలుగులో విశాల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే సగటు టాలీవుడ్ హీరోకు వచ్చినంత ఓపెనింగ్స్ అయితే వస్తాయి. విశాల్ సినిమాలు హిట్‌ అయినా, ప్లాప్‌ అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ప్రేక్షకుల అంచనాలను మార్క్ ఆంటోని అందుకున్నాడా? విశాల్ తనదైన మాస్‌ ట్రీట్‌ను అందించాడా? ఓసారి సమీక్షలో చూద్దాం.

  కథ

  మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. దీంతో ఆంటోనిని మార్క్ ఎలా కాపాడుతాడు?. చనిపోయిన ఆంటోనీ మళ్ళీ ఎలా బతికాడు? ఈ సినిమాలో సునీల్, జాకీ మార్తాండ( ఎస్‌జే  సూర్య), రమ్య( రీతూ వర్మ) పాత్రల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

  ఎలా ఉందంటే?

  మార్క్ ఆంటోనీ టైమ్‌ ట్రావెలింగ్ కథాంశం ఆధారంగా సాగుతుంది. ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రేమ్ టూ ఫ్రేమ్‌లో అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ సన్నివేశాల్లో ఫన్ వర్కవుట్ అయ్యింది. కామెడీ పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇంటర్వెల్ వరకు విశాల్, ఎస్.జె. సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా బావున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కథనం నెమ్మదించిన, కామెడీతో దాన్ని కవర్ చేయడం బాగుంది. ఇక రెండవ సగం, ఆధ్యంతం నవ్వులతో, ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. అయితే తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించడంతో, తెలుగు ప్రేక్షకులకి కొంచెం డిస్కంఫర్టుగా ఉండొచ్చు. మొత్తానికి సినిమాను కామెడీతో ఎంగేజ్ చేసిన విధానం బాగుంది.

  ఎవరెలా చేశారంటే?

  మార్క్ ఆంటోనీలో నటీనటుల గెటప్‌లు వింతగా ఉంటాయి. విశాల్ డ్యూయల్‌లో రోల్‌లో మెప్పించాడు. మార్క్‌గా, ఆంటోనిగా విశాల్ లుక్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. ఎస్‌జే సూర్య సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. డాన్ జాకీగా, డాన్ కుమారుడు మార్తాండ్‌గా కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సునీల్‌కి యాక్టింగ్ పరంగా పెద్దగా అవకాశం లేదు. ఇక రీతూ వర్మ, అభినయ ఇతర నటీనటులు తమ పరిధిమేరకు బాగా నటించారు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త పాత్రలో సెల్వ రాఘవన్ గెటప్, ఆయన నటన ఆకట్టుకుంటుంది.

  డైరెక్షన్

  ఇక విభిన్నమైన కథను ఎంచుకున్న ఆధిక్ రవిచంద్రన్  టైం ట్రావెల్‌కి మంచి కామెడీని జోడించి, ప్రేక్షకులని మెప్పిచడంలో సక్సెస్ అయ్యాడు. నటి నటుల గెటప్‌లు, స్క్రీన్‌ప్లే మీద ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.

  టెక్నికల్‌గా 

  మార్క్ ఆంటోని చిత్రం నిర్మాణ విలువల పరంగా రిచ్‌గా ఉంది. జీవీ ప్రకాష్ అందించిన పాటలు బాగలేకపోయినా.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌లో ఇంకాస్త నైపుణ్యం ప్రదర్శంచాల్సి ఉంది. 

  బలాలు

  విశాల్, ఎస్‌జే సూర్య నటన

  కామెడీ సీన్లు

  బలహీనతలు

  పాటలు

  సెకండాఫ్‌లో రొటీన్ సీన్లు

  సింపుల్ స్టోరీ

  చివరగా: మంచి కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది

  రేటింగ్- 3/5

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv