హరియాణా బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Karam)లో హీరోయిన్‌గా ఈ భామ ఛాన్స్ కొట్టేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే (Pooja Hegde) తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.
మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (Ichata Vahanamulu Niluparadu)తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ ఈ భామ అందానికి మంచి మార్కులే పడ్డాయి.
ఆ తర్వాత రవితేజతో కలిసి నటించే ఛాన్స్ ఈ భామకు తగ్గింది. ఖిలాడిలో మాస్ మహారాజాకు జోడీగా మీనాక్షి కనిపించింది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఈ భామకు గుర్తింపు రాలేదు.
కానీ మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కగానే ఆమెకు ఒక్కసారిగా భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే.. విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో దళపతి విజయ్‌తో జతకట్టే లక్కీ ఛాన్స్ ఆమెకు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే విజయ్ ఆంటోనీ ‘కొలై’ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు వస్తున్న పాపులారిటీతో పలు సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి.
మీనాక్షి చౌదరి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమెది ఆర్మీ కుటుంబం. మీనాక్షి వాళ్ల నాన్న B.R చౌదరి ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. మీనాక్షి తన స్కూలింగ్ అంతా చండీగఢ్‌లో చేసింది. ఆమె రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్, బ్యాడ్మింట్ ప్లేయర్ కూడా.
ఖిలాడీ తర్వాత హిట్-2లోనూ మీనాక్షి నటించింది. హీరో అడవి శేషుకు జోడీగా కనిపించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభిచింది.
హిందీలో ఓ సీరియల్‌లో సైతం మీనాక్షి నటించింది. ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే సీరియల్‌లో అలియా కపూర్ అనే పాత్రను పోషించింది. పంజాబీ, హిందీ భాషల్లో వచ్చిన రెండు మ్యూజిక్ వీడియోలలోనూ ఈ భామ తళుక్కుమంది.
ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీ చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ ఖాతాను 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్