• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఒకే ఫ్రేములో చిరు.. కమల్.. సల్మాన్ 

  టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు బడా స్టార్లయిన చిరంజీవి, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. వీరితో పాటు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ కూడా ఆ ఫొటోలో ఉన్నాడు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్‌ను పిలిచి ఘనంగా సన్మానించాడు. ఈ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ఫొటోలు చూసి ముగ్గురు స్టార్ హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  అభిమానులకు మ్యాజికల్ ఫీస్ట్

  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ VS నార్త్ ఇష్యూ నడుస్తున్న ఈ తరుణంలో ఒక ఇండస్ట్రీకి చెందిన హీరోను సన్మానించేందుకు మరో ఇండస్ట్రీకి చెందిన హీరో రావడం చూసి సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవలే రిలీజయిన కమల్ హాసన్ విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. అసలే చాలా రోజుల నుంచి సరైన హిట్ లేని కమల్ కు విక్రమ్ చాలా స్పెషల్ గా నిలిచింది. మెగాస్టార్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, కమల్ హాసన్ కానీ తమ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి అనేక మందికి ప్రేరణగా నిలిచారు. ఇలా వారు ఎటువంటి ఈర్ష్యలకు పోకుండా ఒకరి సక్సెస్‌ను మరొకరు ఎంజాయ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

  అలనాటి రోజులు గుర్తు చేసుకున్న కమల్

  1979వ సంవత్సరంలో లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి ‘ఇది కథ కాదు’ అనే మూవీ చేశారు. ఈ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీలో మెగాస్టార్ నెగటివ్ రోల్‌లో కనువిందు చేశారు. ఈ పాత్రకు గాను చిరంజీవి పలువురు విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుని కమల్ చిరును ఆకాశానికెత్తారు. పొగడ్తలతో ముంచెత్తారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv