మొబైల్ లవర్స్‌కి ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించేందుకు కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఏటా సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తూ తమవైపు తిప్పుకుంటున్నాయి. ఇలా 2023లో ఎన్నో స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. సరసమైన ధరల్లోనే బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో పవర్‌ఫుల్ ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా సెటప్ కలిగిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు ఏంటో చూద్దాం.
OnePlus Nord CE 3 Lite 5G
వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్లు సరసమైన ధరకే లభిస్తున్నాయి. 6.74 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంది. 8GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. పాస్టల్ లైమ్, క్రొమాటిక్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన కార్డ్‌ల ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్ పొందవచ్చు.
Realme Narzo 60 5G
రియల్‌మీ నార్జో 60 5G స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తోంది. 8GB RAM /128GB ROM వేరియంట్ రూ.17,999కి దక్కుతుండగా, 8GB RAM/256GB స్టోరేజ్ రకం రూ.19,999కి లభిస్తోంది. ఈ ఫోన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు అల్ట్రా ప్రీమియం వేగర్ లెథర్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ మెుబైల్ వస్తోంది.
iQOO Z7s 5G
iQOO Z7s 5G ఫోన్‌ను అమెజాన్‌లో రూ.19,999 పొందవచ్చు. 6.38 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 8GB RAM, 128GB ROM, బెస్ట్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 6GB RAM వేరియంట్‌లోనూ ఫోన్‌ని పొందవచ్చు. రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది. రూ.20 వేల లోపు బడ్జెట్ పెట్టేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్.
Lava Agni 5G
Lava Agni 5G ఫోన్ Android 11.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 6.78 అంగుళాల స్క్రీన్, 5000 mAh బ్యాటరీ, 8GB RAM/128GB స్టోరేజ్, 64 MP AI Quad కెమెరా, తదితర స్పెసిఫికేషన్లతో వస్తోంది. అమెజాన్‌లో రూ.15,990కి లభిస్తోంది.
Samsung Galaxy M34 5G
శాంసంగ్‌లో రూ.25 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలనుకునే వారికి M34 బెస్ట్ ఆప్షన్. 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, No Cost EMI కూడా అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999కి లభిస్తోంది.
Redmi Note 11T 5G
రెడ్‌మీ నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM, 8GB RAMతో 128GB స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో ఇది రూపుదిద్దుకుంది. 33వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తోంది. 6GB RAM వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.
Oppo A78 5G
Oppo A78 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128 GB స్టోరేజ్‌తో మొబైల్ ప్రియులకు అందుబాటులో ఉంది. 5000 mAh బ్యాటరీతో పాటు 33W SUPER VOOC ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50MP AI కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల డిస్‌ప్లే ఫోన్ వస్తోంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. దీని ధర రూ.18,999
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!