• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ఇక మెదడులోనే చిప్!

    సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 2జీ నుంచి 5జీకి చేరుకుంది. ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. అయితే 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్లకు కూడా కాలం చెల్లనుంది. ఇటీవల నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ..2030 కల్లా 6జీ వచ్చేస్తుంది… అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ‘న్యూరాలింక్’ వంటి సాంకేతికతలు ఉపయోగపడతాయన్నారు. అసలు ఈ న్యూరాలింక్ ఏంటీ? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

    న్యూరాలింక్

    న్యూరాలింక్ అంటే మనిషి మెదడు, కంప్యూటర్ కు అనుసంధానం. దీనిపై ఇప్పటికే అనేక పరిశోధనలు సాగుతున్నాయి. అందులో ఎలాన్ మస్క్ ప్రోత్సాహంతో ఓ స్టార్టప్ చేపడుతున్న పరిశోధనలు ఇప్పటికే ఎంతో పురోగతి సాధించాయి.  న్యూరాలింక్ సాయంతో మనిషి కేవలం తన ఆలోచనతోనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో మాట్లాడగలుగుతాడు. అంటే ఇంట్లో లైట్ ఆర్పడం దగ్గర్నుంచి కంప్యూటర్ కీబోర్డు, మౌస్ వాడకుండానే ఆపరేట్ చేసే వరకూ ప్రతీది మెదడుతోనే చేయగలడు. 2030 కల్లా ఇది సాధ్యమవుతుందని అనేక పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

    ఎలా పనిచేస్తుంది?

    న్యూరాలింక్ లో ఓ చిన్న పరికరాన్ని మెదడులో ఇంప్లాంట్ చేస్తారు. దానికున్న చిన్న చిన్నపోగుల్లాంటివి మెదడులోని నాడీమండలంతో కలుస్తాయి. మెదడు ఆలోచించినపుడు ఉత్పత్తయ్యే విద్యుత్ ప్రకంపనలను ఆ పరికరం సమాచారంగా మలిచి బయట ఉన్న వస్తువును నియంత్రిస్తుంది. ఇప్పటికే ఈ దిశగా ఎలాన్ మస్క్ కీలక విజయం సాధించారు. ఓ కోతి న్యూరాలింక్ ద్వారా తన చేతులను వాడకుండానే వీడియో గేమ్ ఆడింది.  కోతికి మొదట ఒక పైప్ ద్వారా పళ్లరసం ఇచ్చి చేతులతో గేమ్ ఆడించారు. అది గేమ్ అడుతున్నపుడు దాని మెదడులోని స్పందనలను న్యూరాలింక్ రికార్డు చేసింది. ఆ తర్వాత కోతి చేతులు వినియోగించకపోయినా మెదడుతోనే గేమ్ అడగలిగింది. దీన్నిబట్టి చూస్తే మస్క్, లండ్ మార్క్ చెబుతున్నట్లుగా స్మార్ట్ ఫోన్లు అంతరించిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాను రానూ మీ ఫోన్లో మా సిమ్ వేసుకోండి అని కాకుండా  మీ మెదడులో మా చిప్ పెట్టుకోండంటూ సంస్థలు ప్రచారం చేయొచ్చేమో!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv