భారత్‌లో మంచి గుడ్‌విల్ ఉన్న మెుబైల్ తయారీ సంస్థల్లో మోటొరోలా (Motorola) ఒకటి. తక్కువ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ మెుబైల్స్‌ను లాంచ్ చేస్తుందన్న పేరు మోటో (Moto)కు ఉంది. ఇదిలా ఉంటే మోటో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Moto G Power (2023) స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానంగా ‘మోటో జీ పవర్ 5జీ’ (Moto G Power 5G) మెుబైల్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ స్క్రీన్
ఈ మెుబైల్ 6.7 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలిసింది. ఈ హ్యాండ్‌సెట్ 167.3 మిమీ x 76.4 మిమీ x 8.5 మిమీ పరిమాణంలో ఉంటుందని సమాచారం.
మెుబైల్ డిజైన్
Moto G Power 5G 2024 దాదాపుగా పాత మోడల్ లుక్‌తోనే రానుంది. అయితే బ్యాక్ కెమెరా యూనిట్ మాత్రం మార్చినట్లు మెుబైల్ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఫ్రంట్ కెమెరా డిస్‌ప్లే పైభాగంలో హోల్-పంచ్ స్లాట్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది.
స్లిమ్ & స్టైలిష్
Moto G Power 5G 2023తో పోలిస్తే నయా మెుబైల్ మరింత స్లిమ్‌గా, స్టైలిష్ లుక్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ రెండూ ఫోన్ కుడి అంచున ఉండనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
స్పీకర్ గ్రిల్
మోటో జీ పవర్ 5జీ మెుబైల్ కింది భాగంలో నాణ్యవంతమైన స్పీకర్ గ్రిల్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5 మిమీ ఆడియో జాక్ ఉండనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ధర ఎంతంటే?
Moto G Power 5G (2024) మెుబైల్ లాంచింగ్ తేదీ, ధరపై మోటో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ కానున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ప్రారంభ మోడల్ ధర రూ.29,999 వరకూ ఉండొచ్చని సమాచారం.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!