ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త మోటో మెుబైల్ రాబోతోంది. ‘Moto G Stylus (2024)’ పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. గతేడాది లాంచ్ చేసిన ‘Moto G Stylus 5G (2023)’ అనుసంధానంగా దీన్ని విడుదల చేయనున్నారు. అయితే ఈ నయా మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లను ప్రముఖ టెక్ వెబ్‌సైట్ రివీల్ చేసింది. ఫోన్‌లోని కీలక ఫీచర్ల గురించి తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇవి ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి వాటిపై ఓ లుక్కేద్దాం.
మెుబైల్ స్క్రీన్
Moto G Stylus (2024) స్మార్ట్‌ఫోన్.. 6.5 అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్‌తో రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి 2,200 x 1,080 pixels క్లాలిటీ, 90Hz రిఫ్రెష్ రేట్‌ని అందించినట్లు చెబుతున్నారు. Qualcomm Snapdragon chipset, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ వర్క్ చేయనుంది.
కెమెరా
ఈ మోటో మెుబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోన్ వెనక భాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరాతో పాటు సెకండరీ కెమెరా సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు సెల్ఫీలు, వీడియోకాల్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను ఫోన్‌కు అందించినట్లు సమాచారం.
స్టోరేజ్ సామర్థ్యం
Moto G Stylus (2024) స్మార్ట్‌ఫోన్.. 128GB స్టోరేజ్ సామర్థ్యంతో రానున్నట్లు ఆన్‌లైన్‌లో చర్చించుకుంటున్నారు. అయితే ర్యామ్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
బ్యాటరీ
ఈ మెుబైల్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు సమాచారం. 20 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు అందిస్తున్నట్లు తెలిసింది. దీని సాయంతో మెుబైల్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చని మోటో వర్గాలు చెబుతున్నాయి.
అదనపు ఫీచర్లు
Moto G Stylus 2024 మెుబైల్‌లో Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.2, USB-C, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే 162.5 x 74.7 x 8.09 mm కొలతల్లో ఈ ఫోన్ రాబోతున్నట్లు తెలిసింది.
కలర్ ఆప్షన్స్
లీకైన ఫొటోను బట్టి Moto G Stylus (2024) బ్లాక్ రంగులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లాంచింగ్ రోజున ఇతర కలర్ ఆప్షన్స్‌పై క్లారిటీ వస్తుంది.
ధర ఎంతంటే?
Moto G Stylus (2024) మెుబైల్ ధర, లాంచింగ్ తేదీపై మోటోరోలా ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14,000 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!