• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Moto G14 Review: మోటో నుంచి నయా స్మార్ట్‌ఫోన్‌.. అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ మోటొరోలా నుంచి మరో సరికొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి రానుంది.  బడ్జెట్‌ ధరకే ఈ కొత్త మోడల్ లాంచ్ కానుంది. ఆగస్టు 1న మోటో G14 (Moto G14) పేరుతో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్లు కూడా అదే తేదీన మ. 12 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో Moto G14 మెుబైల్‌ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని ధర ఎంత ఉండొచ్చు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

    ఫోన్ డిస్‌ప్లే

    మోటో G14 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. ఫోన్ వెనుక భాగం గ్లాసీ ప్యానెల్‌తో వస్తుంది. MediaTek Helio G85 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఇది పనిచేయనుంది. ఆండ్రాయిండ్‌ 14కు అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటును కూడా మోటో కల్పించింది.

    కెమెరా క్వాలిటీ

    మోటో G14 ఫోన్‌కు 50MP మెయిన్ సెన్సార్ ఉన్న డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ (50 MP + 2 MP + 2 MP) అమర్చారు. దీనికి LED ఫ్లాష్‌ లైట్‌ సపోర్ట్ కూడా ఉంది. ఈ కెమెరా సెటప్‌తో 8150 x 6150 Pixels రిజల్యూషన్‌ ఉన్న ఫొటోలను తీయవచ్చు. 1920×1080 @ 30 fps క్వాలిటీతో వీడియో రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్‌ సైడ్‌ 8MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేశారు

    బ్యాటరీ

    మోటో G14 ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ బ్యాటరీ కెపాసిటీతో ఈ స్మార్ట్‌ఫోన్ 34 గంటల వరకు టాక్ టైమ్, 16 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. 

    స్టోరేజ్‌ సామర్థ్యం

    మోటో G14 ఫోన్‌ 4GB RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 1TB వరకూ పెంచుకోవచ్చు. 

    4G మాత్రమే

    మోటో G14 ఫోన్‌ 4Gకి మాత్రమే సపోర్టు చేస్తోంది. బడ్జెట్‌ ఫోన్‌ కావడంతో దీనిని 5Gతో తీసుకురాలేదు. అటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్, IP52 రెసిస్టెన్సీ రేటింగ్‌ వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం.

    కలర్స్‌

    మోటో G14 స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    మోటో G14 ఫోన్ ధర రూ.10,990 ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫోన్ లాంచింగ్ టైమ్‌లోనే దీని ధర, ఇతర వివరాలను కంపెనీ ప్రకటించనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv