• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Moto G54 5G: మోటోరోలా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. ఊహకందని ఫీచర్లు..!

    భారత్‌లోని ప్రముఖ మెుబైల్‌ బ్రాండ్లలో మోటోరోలా (Motorola) ఒకటి. అమెరికాకు చెందిన మోటోరోలా సంస్థకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు మోటోరోలా సిద్దమైంది. మోటో జీ54 5జీ (Moto G54 5G) పేరుతో సెప్టెంబర్‌ 13న భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. మెుబైల్‌ ప్రియుల అంచనాలకు అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో Moto G54 5G ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    Moto G54 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.5 అంగుళాల Full HD+ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. దీనికి 120Hz రీఫ్రెష్‌ రేటు అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 My UI 5.0 ఓఎస్‌తో పనిచేయనుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ (Octa-core MediaTek Dimensity 7020 SoC)ను ఈ ఫోన్ కలిగి ఉంది.

    బిగ్‌ బ్యాటరీ

    Moto G54 5G స్మార్ట్‌ఫోన్‌కు భారీ బ్యాటరీ సమకూర్చారు. ఇందులో 6,000mAh శక్తివంతమైన బ్యాటరీ ఉండడం విశేషం. ఇది 33W టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 0 నుంచి 90 శాతం ఛార్జింగ్‌కు కేవలం 66 నిమిషాలు పట్టనుంది

    స్టోరేజ్‌ సామర్థ్యం

    మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్‌ మోడల్‌.. 8GB RAM + 128GB స్టోరేజ్‌ కలిగి ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను 12GB RAM + 256GB సామర్థ్యంతో తీసుకొచ్చారు. మీ అవసరాలకు తగ్గ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్‌ సాయంతో స్టోరేజ్‌ను 1TB వరకూ పెంచుకోవచ్చు. 

    కెమెరా క్వాలిటీ 

    మోటో జీ54 మెుబైల్‌కు క్వాలిటీ కెమెరాలను అందించారు. ఈ ఫోన్‌ వెనకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సపోర్టింగ్‌ కెమెరా ఫిక్స్‌ చేశారు. ఫ్రంట్‌ సైడ్‌ సెల్ఫీల కోసం 16MP కెమెరా ఫిక్స్‌ చేశారు. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌ 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ కూడా ఉంది. ఈ ఫోన్‌కి సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లు వస్తున్నాయి.

    కలర్స్‌

    మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ను మెుత్తం మూడు రంగులలో మార్కెట్‌లోకి విడుదల చేశారు. మిడ్‌నైట్‌ బ్లూ, మింట్‌ గ్రీన్‌, పర్ల్‌ బ్లూ కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపికచేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    మోటో జీ54 స్మార్ట్‌ఫోన్‌ ధరను వేరియంట్ల ఆధారంగా నిర్ణయించారు. బేస్‌ మోడల్‌ 8GB RAM + 128GB వేరియంట్‌ ధర రూ.15,999గా ఉంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ 12GB RAM + 256GB ధర రూ. 18,999గా కంపెనీ పేర్కొంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. లాంఛ్‌ ఆఫర్‌ కింద ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.1500 లభిస్తోంది. అంతేకాకుండా రూ.668 నుంచి EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

    BUY NOW

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv