అమెరికన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ మోటోరోలా నుంచి సరికొత్త మడతపెట్టే(ఫోల్డేబుల్/ఫ్లిప్)) స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మోటోరోలా రేజర్ 40 (Motorola Razr 40), మోటోరోలా రేజర్ 40 అల్ట్రా(Motorola Razr 40 Ultra) ఇప్పటికే చైనా మార్కెట్లో రిలీజయ్యాయి. జులై 3న ఇండియాలో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ల ధరలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ డిజైన్ని చూస్తుంటే మరోమారు ఆలోచించకుండా కొనేయాలని అనిపిస్తుంది. ఫ్లిప్ ఫోన్లలో అతి సన్ననైన ఫోన్ ఇదేనని, లార్జెస్ట్ స్క్రీన్‌ని కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది.
డిస్ప్లే
మోటోరోలో రేజర్ 40 సిరీస్ భారీ డిస్ప్లేని కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. 165Hz రిఫ్రెష్ రేటుతో 6.9 అంగులాల పీఓలెడ్(pOLED) డిస్ప్లేని కలిగి ఉన్నాయి. మోటోరోలా రేజర్ 40 అల్ట్రాలో 144Hz రిఫ్రెష్ రేటుతో 3.6 అంగులాల భారీ ఔటర్ స్క్రీన్ ఉంది. మరోవైపు, రేజర్ 40 వేరియంట్లో 1.5 అంగులాల కవర్ స్క్రీన్ వస్తోంది. ఔటర్ స్క్రీన్ మిర్రర్‌లా కూడా ఉపయోగ పడనుంది. పాకెట్లో సులువుగా పట్టేలా, మడతపెట్టినప్పుడు నాజూగ్గా కనిపిస్తోంది.
కెమెరా
మోటోరోలా రేజర్ 40 (Motorola Razr 40), మోటోరోలా రేజర్ 40 అల్ట్రా(Motorola Razr 40 Ultra) డ్యుయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ క్లారిటీతో మోటోరోలా రేజర్ 40 ప్రైమరీ కెమెరా రూపుదిద్దుకుంది. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండనుంది. మరోవైపు, మోటోరోలా రేజర్ 40 అల్ట్రాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 12 మెగాపిక్సెల్ క్లారిటీ కలిగిన ప్రైమరీ కెమెరా వస్తోంది. 13 మెగాపిక్సెల్ క్లారిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీనికి తోడుగా ఉండనుంది. ఈ రెండు వేరియంట్లలోనూ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
స్టోరేజీ
మోటోరోలా రేజర్ 40 (Motorola Razr 40), మోటోరోలా రేజర్ 40 అల్ట్రా(Motorola Razr 40 Ultra) స్మార్ట్ఫోన్ల స్టోరేజీ రెండు రకాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 8జీబీ ర్యామ్‌తో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉన్నాయి. 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
పర్ఫార్మెన్స్
మోటోరోలా రేజర్ 40 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషణ్ 1 చిప్సెట్ని కలిగి ఉండనుంది. మోటోరోలా రేజర్ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్సెట్తో రానుంది. రెండింట్లో ఆండ్రాయిడ్ 13 వెర్షన్ సపోర్ట్ చేయనుంది.
బ్యాటరీ
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ విషయంలో కాస్త రాజీ పడాల్సి ఉంటుంది. మోటోరోలా రేజర్ 40లో 3,800mAh బ్యాటరీ ఉండనుంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ రానుంది. మరోవైపు, అల్ట్రా వేరియంట్లో 4,200mAh బ్యాటరీ రానుంది. 30వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు 8వాట్స్ వైర్లెస్ ఛార్జర్ సదుపాయం కలిగి ఉంది.
ధర
చైనాలో జూన్ 1న మోటోరోలా రేజర్ 40 సిరీస్ లాంఛ్ అయింది. మోటోరోలా రేజర్ 40 ధర 3,999 చైనా యువాన్లుగా ఉంది. దాదాపు రూ.46,000. మరోవైపు, అల్ట్రా వేరియంట్ ధర 5,699 చైనా యువాన్లు(రూ.66,000)గా ఉంది. అయితే, భారత్‌లో వీటి ధరలు ప్రకటించాల్సి ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!