కోబ్రా: ఆగస్ట్ 31
ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే తమిళ హీరో విక్రమ్ చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం కోబ్రా. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రంగరంగ వైభవంగా: సెప్టెంబర్ 2
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఎస్వీసీసీ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.
ఫస్ట్ డే ఫస్ట్ షో: సెప్టెంబర్ 2
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఖుషీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ ఈ కథను అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ కామెడీ చిత్రం వసూళ్లు కురిపించవచ్చని అంచనా వేస్తున్నారు.
బలమెవ్వడు: సెప్టెంబర్ 2
దృవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బలమెవ్వడు. ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. సత్య రాచకొండ దర్శకత్వం వహించాడు.
నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా: సెప్టెంబర్ 2
తేజ్ కుర్రపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా. వెంకట్ వందేల దర్శకత్వం వహిస్తున్నాడు. ముల్లేటి కమలాక్షి నిర్మాత.
రామ్ మోహన్ కంచుకొమ్మల: సెప్టెంబర్ 2
ఇది ఒక థ్రిల్లర్ మూవీ. స్వయంగా రామ్ మోహన్ కంచుకొమ్మల నటిస్తూ దర్శకత్వం వహించాడు.
ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు
పేరు | కేటగిరి | భాష | ఓటీటీ | విడుదల తేదీ |
పంచతంత్ర కథలు | మూవీ | తెలుగు | ఆహా | ఆగస్ట్ 31 |
పెళ్లికూతురు పార్టీ | మూవీ | తెలుగు | ఆహా | ఆగస్ట్ 31 |
డౌన్‌టౌన్ అబ్బే: ఎ న్యూ ఎరా | మూవీ | ఇంగ్లీష్ | బుక్ మై షో | ఆగస్ట్ 31 |
ఫెన్స్డ్ ఇన్ | మూవీ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | సెప్టెంబర్ 1 |
మై డియర్ భూతం | మూవీ | తెలుగు | జీ5 | సెప్టెంబర్ 2 |
వాంటెడ్ పండుగాడ్ | మూవీ | తెలుగు | ఆహా | సెప్టెంబర్ 2 |
విక్రాంత్ రోణ | మూవీ | కన్నడ,తమిళ్, తెలుగు | జీ5 | సెప్టెంబర్ 2 |
ఖుదా హఫీజ్: చాప్టర్ 2 | మూవీ | హిందీ | జీ5 | సెప్టెంబర్ 2 |
కట్ పుట్లీ | మూవీ | హిందీ | హాట్‌స్టార్ | సెప్టెంబర్ 2 |
కట్టేరి | మూవీ | తమిళ్ | నెట్‌ఫ్లిక్స్ | సెప్టెంబర్ 2 |
సుందరి గార్డెన్స్ | మూవీ | మలయాళం | సోనీలివ్ | సెప్టెంబర్ 2 |
ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్: సీజన్ 2 | సిరీస్ | హిందీ | నెట్‌ఫ్లిక్స్ | సెప్టెంబర్ 2 |
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ | సిరీస్ | ఇంగ్లీష్ | ప్రైమ్ వీడియో | సెప్టెంబర్ 2 |
డెవిల్ ఇన్ ఒహియో | మూవీ | ఇంగ్లీష్ | నెట్‌ఫ్లిక్స్ | సెప్టెంబర్ 2 |
లిటిల్ వుమెన్ | సిరీస్ | కొరియా | నెట్‌ఫ్లిక్స్ | సెప్టెంబర్ 3 |
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?