సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎందుకంటే?
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్ – ఐనాక్స్ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఇలా బుక్ చేసుకోండి!
మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.
ఈ సినిమాలు చూడొచ్చు!
ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్ హీరో విష్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.
గతంలోనూ ఇలాగే..
రూ.99లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 13న ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్