• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!

    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్‌ బచ్చన్‌‘ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్‌ మెుదలు పెట్టారు. 

    ఓటీటీలోనూ వెక్కిరింపే!

    మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్‌ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్‌ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్‌ బచ్చన్‌’కు కనీస వ్యూస్‌ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్‌ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. 

    దారుణంగా ట్రోల్స్‌

    మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్‌ చూడటానికి ఆడల్ట్‌ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్‌ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్‌’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్‌ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. 

    కథేంటి

    ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ – జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv