• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్‌.. సినిమా హిట్ కొట్టినట్లేనా?

    నటీనటులు: హన్సిక, ముర‌ళీశ‌ర్మ, న‌రేన్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, ప్రవీణ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

    దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్,  

    సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడ‌పు

    సంగీతం: మార్క్ కె రాబిన్‌ 

    నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, 

    సంస్థ‌: వైష్ణ‌వి ఆర్ట్స్‌

    విడుద‌ల‌: 17 న‌వంబ‌ర్ 2023

    టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్‌, నితీన్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్‌ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ `మై నేమ్ ఈజ్ శృతి`. హన్సిక చాలా రోజుల త‌ర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హన్సికకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    కథ

    శృతి (హ‌న్సిక‌) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోవ‌డంతో తాత, అమ్మ పెంప‌కంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి  (న‌రేన్‌) ముఠా వ‌ల‌లో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ శృతికి తెలుస్తాయి. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెన‌క ఎవ‌రున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్‌ పెట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    శృతిగా హ‌న్సిక మోత్వాని మంచి న‌ట‌న‌ కనబరిచింది. ప్ర‌థ‌మార్ధంలో కుటుంబం, ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మ‌లుపుల‌తో కూడిన సీన్లలో మంచి అభిన‌యం ప్రదర్శించిది. పూజా రామ‌చంద్ర‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రేమ ఇందులో వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్ర‌లో కనిపించి మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో న‌రేన్ పర్వాలేదనిపించాడు. ముర‌ళీశ‌ర్మ‌, జయ‌ప్ర‌కాశ్, ప్రవీణ్ అల‌వాటైన పాత్ర‌ల్లో తమదైన నటన కనబరిచారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    చ‌ర్మంతో కూడా వ్యాపారం చేస్తార‌నే కొత్త అంశాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్ ఓం కార్ ఈ సినిమాలో చూపించారు. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్ర‌స్తావ‌న‌తో సినిమా మొద‌లుపెట్టినా పాత్ర‌ల ప‌రిచ‌యానికి, క‌థా నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఏడాది త‌ర్వాత‌, ఆరు నెల‌ల ముందు అంటూ ముక్క‌లు ముక్క‌లుగా క‌థ‌ని చెప్ప‌డం ప్రేక్ష‌కులను గందరగోళానికి గురిచేస్తుంది. కీలక స‌న్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌య్యాడు. అయితే ద్వితియార్థంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

    సాంకేతికంగా 

    సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కిశోర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • హన్సిక నటన
    • ట్విస్ట్‌లు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • ప్రథమార్థం
    • పండని భావోద్వేగాలు 

    రేటింగ్‌ : 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv