• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!

  టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ ’35’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

  ఏం జరిగిందంటే?

  నివేథ థామస్‌ నటించిన ’35  చిన్న కథ కాదు’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు’ అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

  తొలిసారి ‘అమ్మ’ పాత్రలో..

  ’35 చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 

  నాకు పెళ్లైంది : నివేదా థామస్‌

  తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv