ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ కంపెనీ నోకియా.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనూ తనదైన మార్క్‌ను చూపించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను నోకియా లాంచ్ చేసింది. ‘నోకియా జీ42 5జీ’ (Nokia G42 5G) పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్.. మెుబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో Nokia G42 5G ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.56 అంగుళాల IPS LCD HD+ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్‌ను దీనికి అందించారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా స్క్రీన్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC ప్రొసెసర్, గ్రాఫిక్స్ కోసం Adreno GPUను ఫోన్‌కు సమకూర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OSపై పని చేస్తుంది.
స్టోరేజ్ సామర్థ్యం
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ RAM ఆధారంగా రెండు వేరియంట్లను కలిగి ఉంది. 4GB RAM / 128 ROM, 6GB RAM / 128GB స్టోరేజ్ నిల్వతో ఇది అందుబాటులోకి రానుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేగాక ఈ మెుబైల్‌కు 5జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌ను కూడా అందించారు.
కెమెరా క్వాలిటీ
కెమెరా విషయానికొస్తే.. 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఫిక్స్ చేశారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
బిగ్ బ్యాటరీ
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌కు బిగ్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఫోన్లో 5,000mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో ఫోన్‌ను చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ పేరులో ఉన్నట్లుగానే 5G నెట్‌వర్క్‌కు ఇది సపోర్టు చేస్తుంది. అలాగే 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్
నోకియా తన లేటెస్ట్ మెుబైల్‌ను రెండు రంగుల్లో మాత్రమే తీసుకొస్తోంది. పర్పుల్, గ్రే కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళే (సెప్టెంబర్ 11) లాంచ్ అయినప్పటికీ అమ్మకాలు మాత్రం 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు మద్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఈ మెుబైల్ సేల్స్ మెుదలవుతాయి. ఈ ఫోన్ ప్రారంభ ధరను అమెజాన్ రూ.12,599గా నిర్ణయించింది. ధరకు సంబంధించిన పూర్తి వివరాలపై 15న స్పష్టత రానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!