నథింగ్ సంస్థ తాజాగా తమ మొదటి ఓపెన్-స్టైల్ వైర్‌లెస్ హెడ్‌సెట్ నథింగ్ ఇయర్ ఓపెన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు ఆకర్షనీయమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి.
నథింగ్ ఇయర్ ఓపెన్ 14.2mm డైనమిక్ డ్రైవర్‌తో వస్తుంది మరియు ఇది IP54 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది. కాల్స్‌కు మెరుగైన నాణ్యతను అందించేందుకు, AI ఆధారిత క్లియర్ వాయిస్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఒక్క ఛార్జ్ పై 30 గంటల వరకూ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.
ధర:
నథింగ్ ఇయర్ ఓపెన్ ప్రారంభ ధరను రూ. 17,999గా నిర్ణయించారు. ఈ హెడ్‌సెట్ ఒకే వైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందన్న విషయంపై పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, కానీ ఇప్పటికే నథింగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్ లిస్ట్ అయితే చేయబడింది.
ప్రత్యేకతలు:
ఇతర నథింగ్ వైర్‌లెస్ హెడ్‌సెట్‌ల మాదిరిగా, నథింగ్ ఇయర్ ఓపెన్ ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్ ఓపెన్ మంచి డిజైన్‌లో ఉంటూ, చెవికి వెనుకభాగంలో ఉండేలా రూపకల్పన చేయబడింది. 14.2mm డైనమిక్ డ్రైవర్‌తో అమర్చబడి, ఇది వినడానికి నాణ్యమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. నథింగ్ ఫోన్ తో.. ఈ హెడ్‌సెట్ పెయిర్ చేసినప్పుడు, ChatGPT చాట్‌బాట్‌తో పని చేయించే ప్రత్యేక ఫీచర్ ఇందులో ఉంది.
కనెక్టివిటీ:
ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ పించ్ కంట్రోల్, అలాగే స్విఫ్ట్ పెయిర్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్‌లతో వస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్‌తో AAC, SBC కోడెక్‌లకు మద్దతునిస్తుంది. ఒకే సమయంలో రెండు పరికరాలకు జత చేయగలిగే ఈ హెడ్‌సెట్ IP54 రేటింగ్ కలిగి ఉండి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. AI ఆధారిత క్లియర్ వాయిస్ టెక్నాలజీ ద్వారా కాల్ చేసే సమయంలో, 120ms కంటే తక్కువ లేటెన్సీ రేటును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ హెడ్‌సెట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి లేదు.
బ్యాటరీ- ఛార్జింగ్:
రెండు ఇయర్‌బడ్‌లు 64mAh బ్యాటరీతో వస్తాయి. 635mAh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ఛార్జింగ్ కేస్‌ను USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. కేస్ లేకుండా ఒక్కో ఇయర్‌బడ్ ఆరు గంటల కాల్స్ లేదా ఎనిమిది గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
కేస్‌తో పాటు, నథింగ్ ఇయర్ ఓపెన్ గరిష్టంగా 30 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో రెండు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు. ఒక్క ఇయర్‌బడ్ బరువు 8.1 గ్రాములు, మరియు ఛార్జింగ్ కేస్ బరువు 63.8 గ్రాములు గా ఉంది.
నథింగ్ ఇయర్ ఓపెన్ ఆకర్షణీయమైన డిజైన్, వినూత్న ఫీచర్లు మరియు మెరుగైన ఆడియో అనుభవంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది.