గత కొద్ది కాలంగా మొబైల్ ప్రియులను ఊరిస్తూ వస్తున్న నథింగ్ ఫోన్(2) ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. గతేడాది నథింగ్ ఫోన్ (1)తో వినియోగదారులను ఆకట్టుకోవడంతో రెండో ఎడిషన్‌పై ఆసక్తి పెరిగింది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) మెరుగైన ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ప్రధానంగా, అధిక బ్యాటరీ బ్యాకప్, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ముస్తాబైంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటో తెలుసుకుందామా.
పర్ఫార్మెన్స్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్ వర్షన్‌తో నథింగ్ ఓఎస్ 2.0తో పనిచేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ స్టేటస్, ఉబెర్, జొమాటో వంటి థర్డ్ పార్టీ యాప్‌ల పికప్, డెలివరీలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ప్రోగ్రెస్ బార్ ఫీచర్ అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే
ఈ నథింగ్ ఫోన్(2) 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో OLED డిస్‌ప్లేని కలిగి ఉంటుంది.
కెమెరా
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వెనక కెమెరాలు 50 మెగాపిక్సెల్,సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ క్లారిటీని కలిగి ఉంటుంది. Samsung JN1 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంది.
బ్యాటరీ
వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా ఈ ఫోన్ 130 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకోచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4,700mAh కెపాసిటీ. 45 వాట్ పీపీఎస్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగి ఉంది.
స్టోరేజీ
నథింగ్ ఫోన్ 2ను మూడు కేటరిగీల్లో అందుబాటులో ఉంది. 8జీబీ RAM+128జీబీ స్టోరేజీ, 12జీబీ/256జీబీ, 12జీబీ/512జీబీ వేరియంట్లు ఉన్నాయి.
కలర్స్
నథింగ్ ఫోన్ (2) రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. డార్క్ గ్రే, వైట్ కలర్‌లో ఇది లభిస్తోంది.
ధర
నథింగ్ ఫోన్ 2 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999, 12జీబీ/256జీబీ ధర రూ.49,999, 12జీబీ/512జీబీ వేరియంట్ ధర రూ. 54,999గా ధరలను కలిగి ఉన్నాయి. మరో 10 రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో పైన ప్రకటించిన ధరలకు అందుబాటులోకి వస్తాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!