ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (One Plus) మరో సరికొత్త మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. వన్‌ప్లస్ 12 (OnePlus 12) పేరుతో శక్తివంతమైన ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్స్ జనవరి 30 నుంచి మెుదలు కానున్నాయి. ఈ ప్రీమియం రేంజ్ వన్‌ప్లస్ మెుబైల్‌ను ఐఫోన్ 15 (iPhone 15)కు పోటీగా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ను (OnePlus 12 vs iPhone 15) తలదన్నే ఫీచర్లు ఈ OnePlus 12లో ఉన్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మెుబైల్ ఐఫోన్ 15కు పోటీ ఇస్తుందా? ఐఫోన్‌ను బీట్ చేసి అత్యధిక సేల్స్‌ను సాధిస్తుందా? ఐఫోన్ 15తో పోలిస్తే వన్‌ప్లస్ 12లో ఉన్న టాప్ ఫీచర్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
డిస్‌ప్లే
ఐఫోన్ 15 మెుబైల్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.. వన్‌ప్లస్ 12 ఏకంగా 6.82 అంగుళాల AMOLED స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. ఐఫోన్ 8000 x 6000 పిక్సెల్ క్వాలిటీతో వస్తే ఇది 8150 x 6150 పిక్సెల్ రిజల్యూషన్‌తో రూపొందింది. ఐఫోన్ Apple A16 Bionic ప్రొసెసర్‌తో పని చేస్తే.. వన్‌ప్లస్ 12 Qualcomm Snapdragon 8 Gen 3తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ Android v14తో, ఐఫోన్ iOS v17తో వర్క్ చేస్తుంది.
బ్యాటరీ
బ్యాటరీ పరంగా ఐఫోన్ 15తో పోలిస్తే (OnePlus 12 vs iPhone 15) వన్‌ప్లస్ 12 చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఐఫోన్ 15 3349 mAh బ్యాటరీతో రాగా.. వన్‌ప్లస్ 12 5400 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఐఫోన్ 50% ఛార్జ్ అవ్వడానికి 30నిమిషాలు తీసుకుంటే ఈ నయా వన్‌ప్లస్ కేవలం 26 నిమిషాల్లోనే 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 100W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును మెుబైల్‌కు అందించినట్లు చెప్పాయి. ఈ రెండు మెుబైల్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.
కెమెరా
ఐఫోన్ 15 మెుబైల్ వెనక భాగంలో 48 MP + 12 MP రియర్ కెమెరా సెటప్‌తో విడుదలైంది. తాజాగా విడుదలైన వన్‌ప్లస్ 15.. 50 MP + 48 MP + 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఐఫోన్ 15 ముందు వైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండగా.. వన్‌ప్లస్ 32 MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయ్యింది. కెమెరాల పరంగా చూస్తే వన్‌ప్లస్ బెటర్‌గా కనిపిస్తోంది. కానీ పర్‌ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ 15 ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంది.
అడిషనల్ ఫీచర్స్
వన్‌ప్లస్ 12 మెుబైల్.. 164.3 mm పొడవు, 9.1 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటే.. ఐఫోన్ 147.6 mm పొడవు, 7.8 mm థిక్‌నెస్‌తో వచ్చింది. ఈ రెండు మెుబైల్స్ (OnePlus 12 vs iPhone 15) నీటి నుంచి రక్షణను కలిగి ఉన్నాయి. వన్‌ప్లస్ 12లో IP65 రేటింగ్ ఉంటే.. ఐఫోన్ IP68 వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ 12 ఫోన్ Corning Gorilla Glass, Glass Victus 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ కూడా స్క్రీన్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్
వన్‌ప్లస్ 12 మెుబైల్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. సిల్వర్, లీవ్ బ్లాక్, గ్రీన్ రంగుల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటు ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ (OnePlus 12 vs iPhone 15).. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో విడుదలైంది.
ధర ఎంతంటే?
వన్‌ప్లస్ 12 మెుబైల్ ప్రారంభ ధరను కంపెనీ రూ.64,999 నిర్ణయించింది. మరోవైపు ఐఫోన్ 15 బేసిక్ వేరియంట్ రూ.72,990 సేల్ అవుతోంది. ఈ బడ్జెట్ దృష్ట్యా వన్‌ప్లస్ 12 తక్కువ ధరనే కలిగి ఉన్నప్పటికీ బ్రాండ్ దృష్ట్యా ఐఫోన్ పై స్థానంలో ఉంది. మీ అంచనాల ప్రకారం ఏ ఫోన్ మంచి ఫీచర్లను కలిగి చూసుకొని ఆర్డర్ చేసుకోండి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?