ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ (OnePlus) మరో కొత్త మెుబైల్‌ను నేడు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ‘వన్‌ప్లస్ 12ఆర్’ (OnePlus 12R) స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం అయ్యాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం మిడ్ రేంజ్‌లో వచ్చిన ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉందని వన్‌ప్లస్ వర్గాలు ప్రకటించాయి. గతేడాది డిసెంబర్‌లో తీసుకొచ్చిన ప్రీమియం ఫోన్ ‘OnePlus 12’లో మార్పులు చేసి తక్కువ బడ్జెట్‌లో దీన్ని లాంచ్ చేసినట్లు తెలిపాయి. మరి ‘OnePlus 12’, OnePlus 12R మధ్య తేడా ఏంటి? వీటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ నయా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్.. (OnePlus 12 vs OnePlus 12R) 6.78 అంగుళాల AMOLED ProXDR స్క్రీన్‌ను కలిగి ఉంది. LTPO 4.0 సపోర్ట్‌తో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, 1264 x 2780 పిక్సెల్ రిజల్యూషన్‌ను ఫోన్‌కు అందించారు. ఈ మెుబైల్ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్, Adreno 740 జీపీయూ, Android 14 ఆధారిత OxygenOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వర్క్ చేస్తుంది. అటు ‘వన్‌ప్లస్ 12’ మెుబైల్.. 6.82 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, OxygenOS 14 OS, Snapdragon 8 Gen 3 ప్రొసెసర్, Adreno 750 జీపీయూ కలిగి ఉంది.
స్టోరేజ్ & ర్యామ్
OnePlus 12R మెుబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. 8GB RAM + 128GB ROM, 16GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని పొందవచ్చు. డాల్బీ విజన్, 1600 nits (HBM), 4500 nits (peak), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (Corning Gorilla Glass Victus 2 వంటి ఫీచర్లు కూడా ఫోన్ కలిగి ఉంది. మరోవైపు ‘వన్‌ప్లస్ 12’ మాత్రం మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. 12GB RAM + 256GB, 16GB RAM + 512GB, 16GB RAM + 1TB, 24GB RAM + 1TB వేరియంట్లలో ఇది లభిస్తుంది.
కెమెరా క్వాలిటీ
OnePlus 12R ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లలో (OnePlus 12 vs OnePlus 12R) కెమెరా ఒకటి. ఫ్లాష్ లైట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ వచ్చింది. 50MP OIS ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రావైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ఇక ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 16 MP కెమెరాను అమర్చారు. వీటి సాయంతో 4K వీడియోలు.. HDR, panorama ఫొటోలు తీసుకోవచ్చు. వన్‌ప్లస్ 12.. వెనుక భాగంలో 50 MP + 64 MP + 48 MP నాణ్యమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందువైపు 32 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు.
బిగ్ బ్యాటరీ
OnePlus 12R మెుబైల్‌కు పవర్‌ఫుల్ (OnePlus 12 vs OnePlus 12R) బ్యాటరీని ఫిక్స్ చేశారు.100W సపోర్ట్ కలిగిన 5500 mAh బ్యాటరీని ఫోన్‌కు అందించారు. ప్రీమియం మిడిల్ రేంజ్‌లో ఈ స్థాయి పవర్‌ఫుల్ బ్యాటరీతో ఏ మెుబైల్ రాలేదు. 1-100% ఛార్జింగ్‌కు ఈ ఫోన్ 26 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుందని వన్‌ప్లస్ వర్గాలు పేర్కొన్నాయి. అటు వన్‌ప్లస్ 12 మెుబైల్ కూడా ఇదే బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది.
కనెక్టివిటీ ఫీచర్లు
నయా వన్‌ప్లస్ మెుబైల్‌లో 5Gతో పాటు.. Wi-Fi 802.11 a/b/g/n/ac/6/7, Bluetooth 5.3, GPS, GALILEO, GLONASS, BDS, QZSS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అటు వన్‌ప్లస్ 12లోనూ ఇలాంటి ఫీచర్లే ఉన్నప్పటికీ 12Rతో పోలిస్తే అవి మరింత అప్‌గ్రేడెడ్‌గా ఉంటాయి.
అత్యాధునిక సెన్సార్లు
OnePlus 12R, OnePlus 12 మెుబైల్స్ రెండూ ఒకే విధమైన సెన్సార్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిలో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ (Under Display Fingerprint), యాక్సిలోమీటర్ (Accelerometer), గైరో (gyro), ప్రాక్సిమిటీ (Proximity), డిజిటల్ దిక్సూచి (Compass), కలర్ స్పెక్ట్రమ్ (Color Spectrum) వంటి సెన్సార్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
‘OnePlus 12R’ మెుబైల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఐరన్ గ్రే (Iron Gray), కూల్ బ్లూ (Cool Blue) రంగుల్లో దీన్ని పొందవచ్చు. ‘OnePlus 12’ మోడల్ మాత్రం మూడో కలర్ వేరియంట్లలో రావడం విశేషం. ఈ ఫోన్ ఫ్లోవీ ఎమరాల్డ్ (Flowy Emerald), సిల్కీ బ్లాక్ (Silky Black), సిల్వర్ (Silver) రంగుల్లో మార్కెట్‌లో సేల్ అవుతోంది.
ధర ఎంతంటే?
OnePlus 12R ధరను వేరియంట్ల ఆధారంగా (OnePlus 12 vs OnePlus 12R) కంపెనీ నిర్ణయించింది. 8GB RAM/128GB ధర రూ.39,999 కాగా, 16GB RAM/256GB మోడల్‌ను రూ.45,999 దక్కించుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేదా వన్ కార్డుని ఉపయోగించి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేస్తే.. రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అటు OnePlus 12 ప్రారంభ వేరియంట్ (12GB RAM + 256GB) ధర రూ.64,999గా ఉంది. 16GB RAM + 512GB మోడల్‌ను రూ.69,999 పొందవచ్చు.
ఏది బెటర్ ఛాయిస్?
వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ 12 మెుబైల్స్ ఫీచర్లను పరిశీలిస్తే రెండు సిమిలర్‌గానే ఉన్నాయి. కానీ, ప్రీమియం లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, నాణ్యమైన కెమెరా సెటప్ కోరుకునే వారు ‘వన్‌ప్లస్ 12’ను ట్రై చేయవచ్చు. ఎందుకంటే వన్‌ప్లస్ 12కు సబ్ వెర్షన్‌గా ‘వన్‌ప్లస్ 12ఆర్’ను లాంచ్ చేశారు. అయితే బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఉన్న వారు ‘వన్‌ప్లస్ 12ఆర్’ను తీసుకోవచ్చు. దీని గురించి సంకోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫోన్ చిన్న మార్పులు మినహా దాదాపుగా వన్‌ప్లస్ 12 ఫీచర్లనే కలిగి ఉంది. కొనుగోలు శక్తిని బట్టి వీటిలో ఏ మెుబైల్ అయినా ఎంచుకోవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!