ఐఫోన్‌లకు ధీటైన స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ వన్‌ప్లస్ మంచి ఆదరణను సంపాదించింది. ఈ కంపెనీ ఫోన్లు క్వాలిటీ ఫీచర్లతో వస్తుండటంతో టెక్ ప్రియులు సైతం వన్‌ప్లస్ మెుబైల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘OnePlus Ace 3’ పేరుతో కొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన OnePlus Ace 2 మెుబైల్‌కు అనుసంధానంగా ఇది రాబోతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
ఈ మెుబైల్ 6.74 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. 451 ppi పిక్సెల్ డెన్సిటీ, Corning Gorilla Glass ప్రొటెక్షన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OSతో ఫోన్ పనిచేయనుంది.
స్టోరేజ్ సామర్థ్యం
ఈ నయా వన్‌ప్లస్ ఫోన్.. 16GB LPDDR5X RAM / 256GB UFS 4.0 స్టోరేజ్ సామర్థ్యంతో రానున్నట్లు తెలుస్తోంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వీలు కూడా ఉంటుందని సమాచారం.
బ్యాటరీ
‘OnePlus Ace 3’ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీతో రానుంది. 5500 mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. దీనికి ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా అందించినట్లు సమాచారం. దీని సాయంతో మెుబైల్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకునే వీలు కలుగుతుంది. USB Type-C పోర్ట్‌తో ఈ ఫోన్ రానుంది.
కెమెరా క్వాలిటీ
ఈ వన్‌ప్లస్ మెుబైల్‌ను నాణ్యమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా + 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 32 MP టెలిఫొటో సెన్సార్‌తో ఫోన్ రానుంది. ఈ కెమెరాలు 8150 x 6150 Pixels ఇమేజ్ రిజల్యూషన్‌ను అందించనున్నాయి. ఇక ఫ్రంట్ వైపు 16 MP సెల్ఫీ కెమెరాను ఫోన్‌కు అమర్చనున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది.
అదనపు ఫీచర్లు
‘OnePlus Ace 3’ మెుబైల్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. Wi-Fi 6, Bluetooth v5.3, GPS, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రొక్సిమిటీ సెన్సార్ (Proximity sensor), యాక్సిలోమీటర్ (Accelerometer), డిజిటల్ కాంపస్ (Compass), గైరోస్కోప్ (Gyroscope) తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర ఎంతంటే?
‘OnePlus Ace 3’ స్మార్ట్‌ఫోన్ ధరను, లాంచింగ్ తేదీని వన్‌ప్లస్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్ డిసెంబర్ 6న రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ధర రూ.39,999గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!