• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Buds 3: మ్యూజిక్ లవర్స్‌కు మంచి కిక్కిచ్చే ఇయర్‌బడ్స్‌.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ప్లస్‌ (OnePlus) మ్యూజిక్‌ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో రూపొందించిన కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ‘వన్‌ప్లస్‌ బడ్స్‌ 3’ (OnePlus Buds 3) పేరుతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్‌ తొలిసారి చైనాలో (03 జనవరి, 2024) లాంచ్‌ కాగా అక్కడ వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా భారత్‌లోనూ ఈ బడ్స్‌ అడుగుపెట్టడంతో టెక్‌ ప్రియుల దృష్టి దీనిపై పడింది. మరి ‘వన్‌ప్లస్‌ బడ్స్‌ 3’ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఏంత? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

    డిజైన్‌

    OnePlus Buds 3ను కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించింది. మంచి బిల్డ్‌ క్వాలిటీతో లాంచ్ చేసింది. ఇవి ‘శాంసంగ్ గెలాక్సి బడ్స్‌ 2’ ప్రో ఇయర్‌బడ్స్‌కు సిమిలార్‌గా కనిపిస్తున్నాయి. ప్రీమియర్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి.

    సౌండ్‌ క్వాలిటీ

    OnePlus Buds 3లో LHDC 5.0 Hi-Res ఆడియో టెక్నాలజీని చేర్చారు. ఇది అత్యుత్తమ సౌండ్‌ క్వాలిటీకి దోహదం చేస్తుంది. అత్యంత నాణ్యతతో పాటలు వినేందుకు, వాయిస్‌ కాల్‌ మాట్లాడేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 

    మూడు మైక్రోఫోన్స్‌

    ‘వన్‌ప్లస్ బడ్స్ 3’.. మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్‌లు 94ms తక్కువ జాప్యాన్ని కలిగి ఉంటాయి. యూజింగ్‌ సమయంలో ఇవి ఫాస్ట్‌గా స్పందిస్తూ కనిష్ట ఆలస్యాన్ని నిర్ధారిస్తాయి. దుమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ అందించే IP55 రేటింగ్‌తో ఈ బడ్స్‌ వచ్చాయి. 

    నాయిస్ క్యాన్సిలేషన్‌

    ఈ నయా బడ్స్‌.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మద్దతుతో రూపొందాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు విభిన్న వాతావరణాల్లోనూ మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ట్రాఫిక్‌, జర్నీ, రద్దీ ప్రదేశాల్లోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్‌ కాల్‌ మాట్లాడేందుకు సహకరిస్తాయి.

    వాల్యూమ్‌ కంట్రోల్‌

    OnePlus Buds 3లో ఆకట్టుకంటున్న మరో ఫీచర్‌.. టచ్‌ వాల్యూమ్‌ కంట్రోల్‌. వాల్యూమ్‌ అడ్జస్ట్‌ చేసుకునేందుకు ఇది టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని సాయంతో సులభంగా సౌండ్‌ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.

    బ్యాటరీ

    OnePlus Buds 3లోని ఒక్కొక్క బడ్ 58mAh బ్యాటరీని కలిగి ఉంది. 520mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కేస్‌తో వీటిని పొందవచ్చు. USB టైప్-C పోర్ట్‌, ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ వన్‌ప్లస్‌ బడ్స్‌ సపోర్టు చేస్తాయి. 

    బ్యాటరీ లైఫ్‌

    వన్‌ప్లస్ బడ్స్ 3.. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 44 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. 10 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7 గంటల ప్లే టైమ్‌ను పొందవచ్చని వన్‌ప్లస్ వర్గాలు ప్రకటించాయి. ప్రతీరోజూ 10 నిమిషాలు ఛార్జ్‌ చేయడం ద్వారా 6-7 నిర్విరామంగా ఈ బడ్స్‌ సేవలు పొందవచ్చని పేర్కొంది. 

    కలర్ ఆప్షన్స్‌

    ఈ నయా వన్‌ప్లస్‌ బడ్స్‌ రెండు కలర్‌ వేరియంట్లను కలిగి ఉన్నాయి. స్ప్లెన్‌డిడ్‌ బ్లూ (Splendid Blue), మెటాలిక్ గ్రే (Metallic Grey) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే? 

    OnePlus Buds 3 ధరను కంపెనీ రూ.5,499గా నిర్ణయించింది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు.. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లోనూ ఈ ఇయర్‌బడ్స్‌ లభిస్తున్నాయి. అమెజాన్‌లో EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv