వన్ ప్లస్ మొబైల్ లవర్స్‌కు శుభవార్త. OnePlus Nord 3 5G ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ Nord 2Tకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఈసారి వన్‌ప్లస్ నార్డ్ డిజైన్ పరంగా.. ఇతర సాంకేతిక అంశాల పరంగా చాలా అప్డేట్ అయింది. మరి ఈ ఫొన్లో ఎలాంటి అప్డేట్లు వచ్చాయి. ధర, స్టోరేజ్, డిస్ప్లే వంటి అంశాల గురించి పూర్తి రివ్యూలో ఇప్పుడు చూద్దాం.
OnePlus Nord 3 5G price
వన్ ప్లస్ నార్డ్ 3 రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో ఇండియాలో లాంచ్ అయింది. బేస్ మోడల్ వచ్చేసి 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. దీని ధరను రూ.33,999గా నిర్ణయించారు. అలాగే ప్రీమియమ్ మోడల్ మాత్రం 16GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభ్యమవుతోంది. దీని ఖరీదు రూ.37,999గా ఉంది.
OnePlus Nord 3 5G design and display
వన్‌ప్లస్ నార్డ్ 3 రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మిస్టి గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ రెండు కలర్స్ హ్యాండ్‌సెట్‌కు ప్రిమియం లుక్‌ను అయితే అందిస్తున్నాయి. గ్లాసీ పినిషింగ్ వల్ల మిస్టి గ్రీన్ కలర్ వేరియంట్‌ను పట్టుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఈజీగా కనిపిస్తాయి. సో గో ఫర్ గ్రే కలర్. అయితే ఈ రెండు కలర్ వేరియంట్స్ IP54 రేటింగ్ డిస్ప్లేతో బేసిక్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కలిగి ఉన్నాయి. గతంలో వచ్చిన మోడల్లో ఈ సౌకర్యం లేదు
వన్‌ప్లస్ నార్డ్ 6.74 ఇంచెస్ సూపర్ ఫ్లూయిడ్ ఆమోల్డ్ డిస్ప్లేతో వచ్చింది (‘Super Fluid’ AMOLED display). డిస్ప్లే కర్వ్డ్ ఎడ్జ్‌కు బదులు ప్లాట్‌గా ముగిసింది. హ్యాండ్సెట్ బెజిల్స్ సైతం ఎక్కువ మందంగా ఉన్నాయి. ఫలితంగా డిస్ప్లే ద్వారా మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. డిస్ప్లే డైనమిక్ 120Hz రిఫ్రెష్ రేటును అందిస్తుంది.
మరో విషయం ఏమిటంటే వన్‌ప్లస్ నార్డ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ అందిస్తుంది. HDR10+ సపోర్ట్ చేయడం వల్ల అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూసినప్పుడు మంచి అనుభూతి అయితే కలుగుతుంది. దీనిలోని డ్యూయల్ స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఇక చిన్న రూంలో సినిమాలు చూసినా సౌండ్ లౌడ్నెస్ కానీ క్లారిటీ కానీ మిస్ అవదు.
సాప్ట్వేర్
OnePlus Nord 3 5G ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ OS 13.1పై నడుస్తుంది. . ఆక్సిజన్ OS 13.1 ఆండ్రాయిడ్ మెటీరియల్ యు థీమ్‌కు మద్దతు ఇస్తుంది.
బ్యాటరీ లైఫ్
వన్‌ప్లస్ నార్డ్ 3 5000mAh batteryతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌తో స్క్రీన్ ఆన్‌లో ఉంటే ఒకరోజు వరకు బ్యాటరీ లైప్ ఇస్తుంది. గేమ్స్, చాటింగ్, కెమెరా ఫర్పామ్ చేసినప్పుడు మాత్రం 8 గంటల వరకు అయితే బ్యాటరీ ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫుల్ ఛార్జ్ కావడానికి 40 నిమిషాలు సమయం తీసుకుంటుంది.
OnePlus Nord 3 5G cameras
ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ నార్డ్ వచ్చింది. 16 మెగా ఫిక్సెల్తో ఫ్రంట్ కెమెరా, 50 మెగాఫిక్సెల్తో బ్యాక్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంది. ప్రైమరీ కెమెరా పనితీరు డే లైట్లో బాగుంటుంది. అన్ని రకాల కలర్ వైబ్రెంట్స్ను క్యాప్చర్ చేసింది. అల్ట్రావైడ్ కెమెరా మాత్రం యావరేజ్‌గా ఉంటుంది. మెయిన్ కెమెరాతో పోల్చితే కలర్ టెంపరేచర్లో తేడా కనిపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే… లుకేషన్స్ను 4K 60fps వద్ద క్యాప్చర్ చేయగలదు. న్యాచురల్ కలర్స్‌ను బాగా చూపించింది.
వన్‌ప్లస్ నార్డ్ 3 కొనొచ్చా?
అండర్ 40K రేంజ్లో ఇది మంచి ఫీచర్స్‌ను అయితే అందిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో Motorola Edge 40, Samsung Galaxy A34 5G గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఓసారి వాటిని కూడా పరిశీలించి మీ అభిరుచికి ఏది నప్పుతుందో దానిని తీసుకుంటే బెటర్.
చివరగా…
GOOD
స్టైలీష్ డీజైన్
శక్తివంతమైన పనితీరు
ఫుల్ డే బ్యాటరీ లైఫ్
ప్రైమరీ కెమెరా పనితీరు
క్లీన్ సాఫ్ట్వేర్
BAD
యావరేజ్ అల్ట్రా-వైడ్ కెమెరా
ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్‌గా ఉన్న Motorola Edge 40, Samsung Galaxy A34
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం