అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సందర్భంగా ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే పొందవచ్చు. మీరు ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అప్పుడు భారీ డిస్కౌంట్ ధరతో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ చాలా ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్నాయి. వాటి డిజైన్ ఆకర్షణీయంగా ఉండి, మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ధర
భారత మార్కెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్ ధర రూ. 2,199గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ. 1,599కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపుతో కేవలం రూ. 1,449కే పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ఫీచర్లు
ఈ ఇయర్‌బడ్స్ 12.4mm టైటానియం కోటింగ్ కలిగిన డైనమిక్ డ్రైవర్లతో వస్తాయి. సెమీ ఇన్-ఇయర్ డిజైన్‌తో అందుబాటులో ఉండే ఈ బడ్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగి ఉండి స్పష్టమైన ఆడియోను అందిస్తాయి. ఇవి IP55 రేటింగ్ కలిగి ఉండటంతో, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌లో డ్యూయల్ మైక్‌లు ఉన్నాయి, అలాగే బ్లూటూత్ 5.3 తో పనిచేస్తాయి. పూర్తిగా ఛార్జింగ్ చేసినప్పుడు 38 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఒక్క సింగిల్ బడ్ సింగిల్ ఛార్జింగ్‌తో 8 గంటల పాటు పనిచేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్‌బడ్స్ రూ. 2,295 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ కార్డుల ద్వారా గరిష్టంగా రూ. 200 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm టైటానియం డైనమిక్ డ్రైవర్లు, డ్యూయల్ మైక్‌లు, 36dB ANC మరియు AI సపోర్ట్ ఉన్నాయి. ఇవి IP55 రేటింగ్ కలిగి ఉండి, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లతో వస్తాయి. బ్లూటూత్ 5.4 తో పనిచేసే ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్టును కలిగి ఉన్నాయి. వీటిలో 440mAh బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 43 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ANC ఫీచర్ ఆన్‌లో ఉంటే 28 గంటల వరకు బ్యాటరీ లైఫ్ పొందవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!