ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో అత్యాధునిక ఫోన్ భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఆగస్టులో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) పేరుతో ఈ నయా 5G మెుబైల్ తీసుకురానున్నారు. అయితే ఆగస్టు 5న ఈ ఫోన్ రిలీజ్ కానుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వినియోగదారులు కోరుకుంటున్న ఆధునిక ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నట్లు మెుబైల్ తయారీ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? నిజంగా ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకోగలదా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ స్క్రీన్‌ప్లే
OnePlus Nord CE 3 5G ఫోన్ 6.72 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో Full HD+ స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 950 nits అత్యుత్తమ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. Qualcomm Snapdragon 782G SoC ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేయనుంది.
బిగ్ బ్యాటరీ
OnePlus Nord CE 3 5G ఫోన్‌లో 5,000mAh బిగ్ బ్యాటరీని అమర్చారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల వేగంగా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ సామర్థ్యం
OnePlus Nord CE 3 5G ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. 8GB RAM/128GB ROM,12GB RAM/ 256GB వేరియంట్లలో మీకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. సాధారణ మెుబైల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్‌కు RAM సామర్థ్యం ఎక్కువనే చెప్పాలి. దీని వల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అటు స్టోరేజ్ కేపాసిటి అధికంగా ఉండట వల్ల క్వాలిటీ ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
కెమెరా క్వాలిటీ
ఈ ఫోన్ వెనుకవైపు 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ కెమెరాలు సైతం అమర్చారు. ఫ్రంట్ వైపు 16MP పంచ్ హోల్ కెమెరా వస్తుంది. ఈ కెమెరాల సాయంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని వన్‌ప్లస్ కంపెనీ చెబుతోంది.
5G సపోర్ట్
OnePlus Nord CE 3 ఫోన్ 5Gతో రానుంది. 5G నానో సిమ్ కార్డుతో పాటు 12 రకాల 5G బ్యాండ్స్‌కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.3, Wi-Fi 6, డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు Dolby Atmos స్పీకర్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.
కలర్స్
OnePlus Nord CE 3 5G ఫోన్ రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అక్వా సర్జ్, గ్రే షిమ్మర్ రంగుల్లో మీకు నచ్చిన కలర్ ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
OnePlus Nord CE 3 5G ఫోన్.. వేరియంట్ ఆధారంగా ధరను కలిగి ఉంది. ధరలపై అధికారిక ప్రకటన రానప్పటికీ 8GB RAM/128GB ROM వేరియంట్‌ను Rs 24,999కు విక్రయించవచ్చని తెలుస్తోంది. అలాగే 12GB RAM/ 256GB వేరియంట్‌ను Rs 26,999కు అమ్మవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫోన్ రిలీజ్ అనంతరం ధరలపై క్లారిటీ రానుంది.