• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Nord CE 3 5G: రూ.30 వేల లోపు బెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్.. కళ్లుచెదిరే ఫీచర్స్‌ దీని సొంతం!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వన్‌ప్లస్‌ ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ ఫోన్లు చాలా పాపులర్‌గా మారాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ లాంఛ్‌ చేసే వన్‌ప్లస్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో భారత్‌లోకి రాబోతోంది. ‘OnePlus Nord CE 3 5G ఫోన్‌ను ఆగస్టు 4 నుంచి సేల్‌కి తీసుకు రానుంది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంది? ధర, ఆఫర్లు వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G (OnePlus Nord CE 3 5G) స్మార్ట్‌ ఫోన్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మెుబైల్‌ 6.7 అంగుళాల Full HD+ ఫ్లుయిడ్‌ అమోల్డ్‌ స్క్రీన్‌ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటును ఫోన్‌కు ఫిక్స్‌ చేశారు. క్వాల్‌కామ్ Snapdragon 782G SoC పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఇది తయారైంది. 

    స్టోరేజ్‌ కెపాసిటీ

    OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ కానుంది. 8GB RAMతో పాటు 128GB, 12GB RAM, 256GB వేరియంట్లలో ఇది మార్కెట్‌లోకి రానుంది.  MicroSD card కార్డు ద్వారా 1TB వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ RAM ఉండటం వల్ల చాలా వేగంగా పనిచేయనుంది. చిన్నసమస్య కూడా రాకుండా ఒకే సమయంలో 24 అప్లికేషన్ల వరకు వాడొచ్చని వన్‌ప్లస్ తెలిపింది. 

    ఫోన్‌ బ్యాటరీ

    OnePlus Nord CE 3 5G ఫోన్‌కు 5,000mAh బ్యాటరీ సామర్థ్యం అందించారు. ఇది 80W SUPER VOOC లైటెనింగ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. దీని సాయంతో ఫోన్‌ను వేగంగా చార్జ్‌ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. 15 నిమిషాల చార్జ్‌తో రోజంతా ఫోన్‌ను వినియోగించవచ్చని వన్‌ప్లస్‌ వర్గాలు తెలిపాయి. 

    కెమెరా క్వాలిటీ

    OnePlus Nord CE 3 5G ఫోన్‌కు నాణ్యమైన కెమెరాలను ఫిక్స్‌ చేశారు. ప్రైమరి కెమెరాగా 50 MP Sony IMX890 sensor అమర్చారు. అలాగే 8MP Sony IMX355, 2MP మాక్రో కెమెరాలతో ట్రిపుల్‌ రియర్‌ సెటప్‌ను అందించారు. 16MP సెల్ఫీ కెమెరాను కూడా ఈ ఫోన్‌ కలిగి ఉంది.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ ఫోన్‌ 5G నెట్‌వర్క్‌కు ‌అద్భుతంగా పనిచేస్తోంది. 5G, 4G LTE, Wi-Fi, Bluetooth 5.2, NFC, GPS, A-GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వాటితో పాటు యాక్సిలోమీటర్‌, ambient లైట్‌ సెన్సార్‌, దిక్సూచి, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, టెంపరేచర్‌ సెన్సార్లను ఈ ఫోన్ కలిగి ఉంది. 

    కలర్స్‌

    OnePlus Nord CE 3 5G ఫోన్‌ రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    OnePlus Nord CE 3 5G వేరియంట్లను బట్టి ధరలను నిర్ణయించారు. 8GB RAM/128GB ROM ఫోన్‌  రూ.26,999కు లభిస్తోంది. 12GB RAM/256GB ROM ఉన్న ఫోన్‌ ధరను రూ.28,999గా నిర్ణయించారు. 

    క్రేజీ ఆఫర్లు 

    OnePlus Nord CE 3 5G ఫోన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలుంది. ఆన్‌లైన్‌లో అయితే అమెజాన్ , వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి SBI బ్యాంక్ కార్డులపై, క్రెడిట్ కార్డ్ EMIపై రూ. 2 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసే ఎర్లీ బయ్యర్స్‌‌కి రూ. 2 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందనుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, వన్ కార్డ్ యూజర్లకు ఇది వర్తిస్తుంది. 

    BUY IT

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv