ప్రముఖ స్మార్ట్ ఫొన్ బ్రాండ్ OnePlus నుంచి మరో కొత్త ఫొన్ రిలీజ్ కానుంది. అదే OnePlus Open . అయితే ఇది వన్‌ప్లస్ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ ఫొన్. ఇప్పటికే ఫొల్డబుల్ ఫొన్ల రేసులో ఓప్పో, శామ్‌సంగ్, ఎల్‌జీ బ్రాండ్లు ముందున్నాయి. తాజాగా ఈ రేసులోకి వన్ ప్లస్ అడుగుపెట్టింది అని చెప్పాలి. వన్ ప్లస్ బ్రాండ్‌కు ఇండియాలోని యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన అన్ని ఫొన్లు దాదాపుగా హిట్ అయ్యాయి. అలాగే యూత్‌లో ఫొల్డబుల్ ఫొన్లకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘వన్ ఫ్లస్ ఓపెన్’ గ్యాడ్జెట్‌ను ప్రత్యేకంగా తయారు చేసింది. తాజాగా ఈ ఫొన్ అక్టోబర్ 19న లాంచ్ కానున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు, డిస్‌ప్లే, కీ ఫీచర్స్ ఏమిటో ఓసారి తెలుసుకుందాం.
OnePlus Open డిజైన్
OnePlus ఓపెన్ ఫోన్ అయితే Samsung Galaxy Z Fold5, vivo X Fold2 మాదిరిగానే అవుట్‌వర్డ్ ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. OnePlus ఫోల్డ్ నాజుకైన మెటల్ సైడ్‌లను, లెదర్ లాంటి స్మూత్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. ఈ స్లైడ్స్‌పై పవర్ బటన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఎడమ వైపున అలెర్ట్ స్లయిడర్‌ను కలిగి ఉంటుందని లీక్స్ ద్వారా తెలిసింది.
OnePlus Open డిస్‌ప్లే
వన్‌ప్లస్ ఓపెన్ డిస్‌ప్లే 6.31 ఇంచెస్ పొడవుతో అత్యాధునికమైన టెక్నాలజీతో రానుంది. దీని ఇన్నర్ డిస్‌ప్లేను BOE ప్యానెల్‌తో తయారు చేశారు. 2K రెజల్యూషన్ FHD+ 120Hz రిఫ్రెష్ రేటుతో రానుంది. దీని డిస్‌ప్లే 1440Hz PWM వద్ద డిమ్మింగ్, 2,800 nits వద్ద హైబ్రైట్‌నెస్ అయితే ఇస్తుంది.
కెమెరా
ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టంను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 48-మెగాపిక్సెల్ డ్యూయల్-లేయర్ ట్రాన్సిస్టర్ ఔట్‌సోల్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్/6x లాస్‌లెస్ జూమ్ సపోర్ట్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. మూడవ సెన్సార్ 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యూనిట్‌కు డెడికెట్ చేశారు. ఫ్రంట్ కెమెరా డ్యుయల్ కెమెరా సిస్టంతో వస్తున్నట్లు తెలిసింది. 32MP (OV32C) – outside, 20MP – inside ఆప్షన్లతో వస్తున్నట్లు సమాచారం.
ఆపరేటింగ్ సిస్టమ్
OxygenOS 3.1 సపోర్ట్ చేయనున్న వన్‌ప్లస్ ఓపెన్… క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ద్వారా నడవనుందని టాక్. ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ 13 ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
స్టోరేజ్ టైప్ &స్పీకర్స్
OnePlus ఓపెన్ 16GB RAM, 512GB స్టోరేజ్ సామర్థ్యంతో రానుట్లు టాక్ వినిపిస్తోంది. 100జీబీ వరకు గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఫీచర్‌ను కలిగి ఉండనుంది. క్వాడ్ టైప్ స్పీకర్స్ Dolby atoms ఫీచర్స్‌ను కలిగి ఉండనున్నట్లు తెలిసింది.
కలర్స్
ఈ ఫోన్ కలర్స్ వేరియంట్లపై ఇంకా స్పష్టత రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం టైటాన్ బ్లాక్, ఎట్రెనల్ గ్రీన్, మార్బల్ ఓడెస్సీ కలర్స్ వేరియంట్లలో లభ్యమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
యాప్స్ కనెక్టివిటీ
వన్ ప్లస్ ఓపెన్‌లో అన్నిరకాల యాప్స్ కనెక్టివిటీని ఆఫర్ చేయవచ్చు. GLONASS జీపీఎస్ కనెక్టివిటీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, Bluetooth, Wi-Fi, USB కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఉండనున్నట్లు తెలిసింది. డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్స్‌ను ఇందులో అమర్చినట్లు సమాచారం.
బ్యాటరీ సామర్థ్యం
వన్ ప్లస్ 11 మాదిరి 5000mah బ్యాటరీ కెపాసిటితో కాకుండా OnePlus OPEN అయితే 4805mah బ్యాటరీ సామర్థ్యంతో అయితే రానుంది.
ధర
దీని ధరపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారు రూ. 1,39,999 ఉండే అవకాశం ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద ఇప్పటికే పలు సంస్థలు రూ.5 వేలు విలువ చేసే కొనుగోలు వోచర్లను ఆఫర్ చేస్తున్నాయి.
ఎప్పుడు అందుబాటులో?
వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ 19న భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది. అక్టోబర్ 27 నుంచి ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!