చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వన్ ప్లస్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ తయారు చేసిన ఫోన్లను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ సంస్థ తొలిసారి ట్యాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) ను తయారు చేసింది. దానిని దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇతర కంపెనీ టాబ్లెట్లకు తమ టాబ్ గట్టి పోటీ ఇస్తుందని రిలీజ్ సందర్భంగా వన్‌ప్లస్ పేర్కొంది. ఇంతకీ వన్‌ప్లస్ ప్యాడ్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని ధర ఎంత? అనేది ఈ కథనంలో పరిశీలిద్దాం.
బిగ్ డిస్‌ప్లే
OnePlus Pad ఏకంగా 11.61 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 144hz రిఫ్రేష్ రేటుతో LCD స్క్రీన్‌ను తీసుకొచ్చారు. ఈ ట్యాబ్‌కు మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ను అమర్చారు. Oxygen 13.1 OSతో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.
బాహుబలి బ్యాటరీ
OnePlus Padలో 9510 mAh బిగ్ బ్యాటరీని అమర్చారు. అలాగే 67W SUPERVOOC ఛార్జర్‌ను కూడా అందిస్తున్నారు. దీని సాయంతో ట్యాబ్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ సామర్థ్యం
OnePlus Padను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 8GB RAM/128GB, 12GB RAM/256GB వేరియంట్లలో ఇది లభిస్తోంది. ర్యామ్, ట్యాబ్ స్టోరేజ్ అవసరాన్ని బట్టి కావాల్సిన మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
కెమెరా క్వాలిటీ
OnePlus Pad బ్యాక్ సైడ్ 13MP కెమెరాను అమర్చారు. దీనితో 720p 30 fps, 1080p 30 fps, 4K 30 fps క్వాలిటీ వీడియోలను రికార్డు చేయవచ్చు. ఫ్రంట్ వైపు 8MP ఫిక్స్ చేశారు.
బిల్డ్ క్వాలిటీ
OnePlus Padను స్లిమ్ అండ్ స్మార్ట్‌గా తీసుకొచ్చారు. ఈ టాబ్లెట్ బరువు 550 గ్రాములు ఉంది. థిక్‌నెస్ అంతా కలిపి 0.65 సెంటీమీటర్లే ఉంది. ఇది చాలా తేలికైన, స్లిమ్ టాబ్లెట్ అనుకోవచ్చు.
దీనికి ఫిజికల్ బటన్స్ కూడా తక్కువే ఇచ్చారు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ మాత్రమే ఉన్నాయి.
దీన్ని మెటల్‌తో తయారుచేసారు. చుట్టూ 2.5D రౌండ్ ఎడ్జ్ ఇచ్చారు. పట్టుకున్నప్పుడు గ్రిప్ దొరుకుతుంది.
కలర్
OnePlus Padను ఒక రంగులోనే కంపెనీ రిలీజ్ చేసింది. ఇది హాలో గ్రీన్ రంగులో లభిస్తుంది.
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ ట్యాబ్ వర్క్ చేసుకునేందుకు సౌకర్యంగా ఉంటుందని వన్‌ప్లస్ తెలిపింది. 5G స్పీడుతో డాక్యుమెంట్లు షేర్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే మల్టీమీడియా కంటెంట్, వినోదాత్మక వీడియోలు చూసేందుకు OnePlus Pad మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పింది. దీని ద్వారా ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లను కూడా వీక్షించవచ్చు.
ధర ఎంతంటే?
OnePlus Pad రెండు వేరియంట్లలో లభిస్తుండటంతో వాటి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
8GB RAM/128GB మోడల్ ధర రూ.37,999గా ఉంది. 12GB RAM/256GB వేరియంట్‌ను
రూ.39,999 విక్రయిస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం