• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Watch 2:  వంద గంటల బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌.. ధర ఎంతంటే?

    ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తోంది. యూత్‌ గ్యాడ్జెట్స్‌ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ వాచ్‌లను ధరించి స్టైల్‌గా కనిపించేందుకు ఉత్సాహాపడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రముఖ టెక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ అధునాతన ఫీచర్లతో సరికొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) ఈవెంట్‌లో వరల్డ్‌ వైడ్‌గా ‘వన్‌ప్లస్‌ వాచ్‌ 2’(OnePlus Watch 2)ను విడుదల చేసింది. 2021 మార్చిలో వచ్చిన వన్‌ప్లస్‌ వాచ్‌ (OnePlus Watch)కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చారు. ఈ నయా వాచ్ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    వాచ్ స్క్రీన్‌

    ఈ నయా వన్‌ప్లస్ వాచ్‌ 2.. 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేతో లాంచ్ చేశారు. 466 x 466 పిక్సెల్ రిజల్యూషన్‌, 600 nits పీక్‌ బ్రైట్‌నెస్‌ అందించారు. ఈ వాచ్‌ Qualcomm’s Snapdragon W5 SoC చిప్‌సెట్‌పై గూగుల్‌ ఆధారిత Wear OS 4తో వర్క్ చేయనుంది. దీని ద్వారా గూగుల్‌ యాప్స్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    OnePlus Watch 2.. వేగంగా పనిచేసేందుకు 2GB RAM ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. అలాగే 32GB స్టోరేజ్‌ సామార్థ్యాన్ని ఈ కొత్త వాచ్‌కు అందించారు. 

    బ్యాటరీ లైఫ్‌

    ఈ స్మార్ట్‌వాచ్‌ 500mAh బ్యాటరీతో విడుదలైంది. స్మార్ట్‌మోడ్‌లో వినియోగిస్తే ఈ వాచ్‌ 100 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని వన్‌ప్లస్‌ వర్గాలు వెల్లడించాయి. హెవీగా యూస్‌ చేస్తే 48 గంటల పాటు నిర్విరామంగా సేవలు పొందవచ్చని స్పష్టం చేశాయి. 7.5W VOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వచ్చిన ఈ వాచ్‌ను 60 నిమిషాల్లోనే ఫుల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చని వన్‌ప్లస్‌ పేర్కొంది.

    హెల్త్ సెన్సార్లు

    OnePlus Watch 2లో అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌ సెన్సార్లను కంపెనీ తీసుకొచ్చింది. ఆక్సీమీటర్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, హార్ట్ బీటింగ్‌, స్ట్రెస్‌ మోడ్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా స్లీప్‌ ట్రాకింగ్‌ సెన్సార్‌.. మీ నిద్రను పర్యవేక్షిస్తుంది. మీ శ్వాస క్రియను ఎప్పటికప్పుడు గమనిస్తుంది. గురక వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటే ఈ వాచ్ ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. 

    స్పోర్ట్స్ మోడ్‌

    ఫిట్‌నెస్‌కు దోహదం చేసే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇండోర్, ఔట్‌డోర్‌ స్పోర్ట్స్‌కు సంబంధించిన ట్రాకర్స్ వాచ్‌తోపాటు ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. క్రికెట్‌, టెన్నిస్, వాలీబాల్‌, జిమ్నాస్టిక్స్ తదితర స్పోర్ట్స్‌కు సంబంధించిన మోడ్‌ను ఎంచుకోవడం ద్వారా మీ శరీరంలో ఖర్చయ్యే కెలరీల సమాచారాన్ని ఈ వాచ్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ రూపంలో అందిస్తుంది. 

    వాటర్‌ రెసిస్టెన్స్

    ఈ నయా వన్‌ప్లస్‌ స్మార్ట్‌వాచ్.. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగిన IP68 రేటింగ్‌తో వచ్చింది. అలాగే అడ్వాన్స్‌డ్‌ బ్లూటూత్ కాలింగ్‌, GPS ట్రాకింగ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. 

    కలర్ ఆప్షన్స్‌

    OnePlus Watch 2ను రెండు కలర్‌ వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. బ్లాక్‌ స్టీల్‌ (Black Steel), రేడియంట్‌ స్టీల్‌ (Radiant Steel) రంగుల్లో దీనిని పొందవచ్చు.

    ధర ఎంతంటే?

    భారత్‌లో OnePlus Watch 2 ధరను కంపెనీ రూ.24,999గా నిర్ణయించింది. మార్చి 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో వాచ్‌ సేల్స్ ప్రారంభం కానున్నాయి. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌, క్రోమా తదితర ఈ కామర్స్ సైట్లలో ఈ వాచ్‌ను పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు కొనుగోలుపై రూ.2,000 వరకూ డిస్కౌంట్‌ను వన్‌ప్లస్‌ ఆఫర్ చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv