• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Watch 2: క్రేజీ ఫీచర్స్‌తో వచ్చేస్తున్న నయా వన్‌ప్లస్‌ వాచ్‌.. టెక్‌ ప్రియులకు పండగే!

    ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత డిజిటల్ వాచ్‌లపై అధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది గమనించిన ప్రముఖ టెక్‌ కంపెనీలు అధునిక ఫీచర్లతో వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌వాచ్‌ ప్రియులకు వన్‌ప్లస్‌ (OnePlus) శుభవార్త చెప్పింది. త్వరలోనే అత్యాధునిక స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘OnePlus Watch 2’ పేరుతో ఈ వాచ్ పరిచయం కానుంది. 2021 మార్చిలో వచ్చిన వన్‌ప్లస్‌ వాచ్‌ (OnePlus Watch)కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.

    మోడల్ నెంబర్

    వన్‌ప్లస్ వాచ్ BIS వెబ్‌సైట్‌లో లిస్ట్‌ కూడా అయినట్లు తెలుస్తోంది. OPWWE231 మోడల్‌ నెంబర్‌తో ఇది రాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

    వాచ్‌ డిజైన్‌

    ఈ స్మార్ట్‌వాచ్ వృత్తాకార ప్రదర్శనను కలిగి ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్ వాచ్‌పై కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను అందించాలని భావిస్తున్నప్పటికీ, మునుపటి మోడల్ మాదిరిగా కస్టమ్ RTOS ప్లాట్‌ఫారమ్‌లో ఇది రానుందని సమాచారం.

    వాచ్‌ స్క్రీన్

    OnePlus Watch 2.. 1.39 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 

    వాట్సప్‌ సపోర్ట్‌

    OnePlus Watch 2 స్మార్ట్‌వాచ్‌ వాట్సప్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ ప్లే, పలు యాప్‌లను ఈ వాచ్‌ ద్వారా కంట్రోల్‌ చేయవచ్చని తెలుస్తోంది. 

    పవర్‌ఫుల్ ప్రొసెసర్

    ఈ వాచ్‌ Qualcomm’s Snapdragon W5 Gen 1 చిప్‌సెట్‌తో రానుందట. దీనివల్ల వాచ్‌ ఎటువంటి హ్యాంగింగ్‌ సమస్య లేకుండా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుందని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

    బ్యాటరీ లైఫ్‌

    ఈ స్మార్ట్‌వాచ్‌ 405mAh బ్యాటరీతో రానుందట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సమాచారం.

    వాటర్‌ రెసిస్టెన్స్‌

    ఈ స్మార్ట్‌వాచ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్‌తో రానుంది. అలాగే బ్లూటూత్, హెల్త్‌, ఫిట్‌నెస్‌ తదితర ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

    కలర్స్

    ఈ వాచ్‌ రిలీజ్‌పై వన్‌ప్లస్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 2024లో ఇది రానున్నట్లు సమాచారం. దీని ధర రూ.16,999 వరకూ ఉండొచ్చని అంచనా. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో వాచ్‌ లభిస్తుందని తెలిసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv