• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Operation Valentine Box Office Collections:  ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!

    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో.. ఫైటర్‌ పైలెట్‌గా వరుణ్‌ తేజ్‌ మంచి నటన కనబరిచాడు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని అంతా భావించారు. కానీ ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కలెక్షన్స్‌కు ఎంతో కీలకమైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం రూ.6 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

    బ్రేక్ ఈవెన్‌ కష్టమే!

    భారత వైమానిక దళం (Operation Valentine Weekend Collections) ఆధారంగా వచ్చిన తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. దీంతో సహజంగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం విడుదలకు ముందు కూడా మంచి బిజినెస్‌ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. తొలి షోకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ను బట్టి ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంతా భావించారు. అయితే తొలి వీకెండ్‌ వసూళ్లను చూసి మూవీ టీమ్‌ అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. కనీసం బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

    50% దాటని ఆక్యుపెన్సీ!

    ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని వరుణ్ తేజ్‌ (Varun Tej)తో పాటు చిత్ర యూనిట్‌ చాలా బాగా ప్రమోట్‌ చేసింది. క్రమం తప్పకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్స్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఒకేసారి రిలీజ్‌ చేయడంతో బాలీవుడ్‌లోనూ మేకర్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహించారు. అయితే హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు.

    ఇదేనా కారణం?

    అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు (Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది

    హిందీలో దెబ్బతీసిన ‘ఫైటర్‌’!

    ఇటీవల హిందీలో హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందిన ‘ఫైటర్‌’ (Fighter) చిత్రం రిలీజైంది. ఈ చిత్రం కూడా భారత వైమానిక దళం కాన్సెప్ట్‌తోనే విడుదలైంది. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. పైగా ఈ రెండు చిత్రాల విడుదలకు పెద్దగా గ్యాప్ కూడా లేకపోవడంతో హిందీలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్’ పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్‌కు తెలుగు, హిందీ భాషల్లో ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిరాశనే మిగిల్చింది.

    సినిమాను అవే దెబ్బతీశాయా?

    ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ సెట‌ప్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో యాక్టింగ్ బాగున్నా.. కథలో స్ట్రాంగ్ ఎమోష‌న్ క‌నిపించ‌దు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను స‌క్సెస్ చేయ‌డంలో వైమానిక ద‌ళం ప‌డిన క‌ష్టాన్ని పైపైన చెప్పిన‌ట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ల‌వ్‌స్టోరీ సైతం స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామ‌న్ ఆడియెన్స్‌కు చాలా వరకు అర్థం కాలేదు. గ్రాఫిక్స్ విష‌యంలో కూడా అక్క‌డ‌క్క‌డ కాంప్ర‌మైజ్ అయిన‌ట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    త్వరగానే ఓటీటీలోకి!

    ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కా (Matka)లో నటిస్తున్నాడు.

    సాక్నిక్‌ లెక్కల ప్రకారం

    ఇదిలా ఉంటే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కలెక్షన్స్‌ వివరాలను ప్రముఖ సినిమా వెబ్‌సైట్‌ ‘సాక్నిక్‌’ వెల్లడించింది. దాని ప్రకారం వరుణ్ తేజ్‌ సినిమా కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

    తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ – రూ.4.42 కోట్లు

    హిందీలో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ -రూ. 1.29 కోట్లు

    దేశవ్యాప్తంగా మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ – రూ. 5.71 కోట్లు

    ఓవర్సీస్‌లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ – రూ.0.25కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్స్ వసూళ్లు – రూ.6 కోట్లు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv